News November 13, 2025
HYD: మనం తాగే మినరల్ వాటర్ సేఫేనా?

నగరంలో పుట్టగొడుగుల్లాగా వెలసిన RO ప్లాంట్లపై అధికారుల తనిఖీలు ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కీళ్లనొప్పులు, హెయిర్‌లాస్ వంటి సమస్యలు ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ వల్లే వస్తాయనే అధ్యయనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ ప్లాంట్‌లలో, డబ్బాలో నీళ్లు తెచ్చుకోవాలనే కనీస అవగాహన కరవైందని వాపోతున్నారు. ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి, ప్లాంట్‌లపై స్పష్టమైన నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News November 13, 2025
ములుగు: ఎక్సైజ్ శాఖలో వాహనాలకు వేలంపాట

ములుగు ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు రేపు వేలంపాట నిర్వహించనున్నట్లు సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. ఉ. 11 గంటలకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు వాహనం ధరలో 50% చెల్లించి పాల్గొనాలన్నారు. వాహనం పొందిన వారు అదే రోజు పూర్తి సొమ్మును చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని కోరారు.
News November 13, 2025
ఈ టిప్స్‌తో ల్యాప్‌టాప్ బ్యాటరీ హెల్త్ సేఫ్

ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు 20-80% ఛార్జింగ్ ఉన్నప్పుడు బాగా పనిచేస్తాయి. 100% ఛార్జ్ చేసిన ప్రతిసారీ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. 25% కంటే తక్కువకు చేరినప్పుడు ఛార్జింగ్ పెట్టాలి. కంపెనీ లేదా సర్టిఫైడ్ ఛార్జర్లనే వాడాలి. అధిక చల్లదనం, వేడి ప్రాంతాల్లో, బెడ్, బ్లాంకెట్‌పై ఉంచి ల్యాప్‌టాప్ వాడొద్దు. బ్రైట్‌నెస్, బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ బ్యాటరీ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
News November 13, 2025
కరీంనగర్ ‘టాస్క్’లో రేపు జాబ్ డ్రైవ్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్, మొదటి అంతస్తులో గల ‘టాస్క్’ కార్యాలయంలో నవంబర్ 14న(రేపు) జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం ఈ డ్రైవ్ చేపడుతున్నారు. 2024-25లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఉదయం 9 గంటలకు ఆసక్తి గల అభ్యర్థులు హాజరుకావాలని వారు సూచించారు.


