News September 19, 2025
HYD: మన బతుకమ్మ ఇంటర్నేషనల్ రేంజ్‌కు లోడింగ్

ఈ ఏడాది బతుకమ్మ వేడుక చరిత్రలోనే కీలక ఘట్టంగా SEP 28న ఎల్బీస్టేడియంలో ఆవిష్కృతం కానుంది. ఒకే వేదికపై 20,000 మంది మహిళలతో బతుకమ్మ ఆడించి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు పర్యాటకశాఖ నడుం బిగించింది. తెలంగాణ సంస్కృతిని ప్రపంచపటం మీద నిలిపేందుకు, విదేశీ ఎయిర్‌లైన్ల నుంచి మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించడం ఈ సారి ప్రత్యేక ఆకర్షణ. ఇదే జరిగితే బతుకమ్మ ప్రపంచస్థాయి పండుగగా గుర్తింపు పొందడం ఖాయం.
Similar News
News September 19, 2025
HYDలో భారీ వరద.. కారు గ్లాస్‌లో నుంచి బయటకు తీశారు

గౌలిపురాలో నిన్న రాత్రి భారీ వర్షం కురువడంతో హనుమాన్‌నగర్ ఫేజ్- 2లో పెద్ద ఎత్తున వరదనీరు చేరుకుంది. మణికొండకు చెందిన ఓ కుటుంబం కారులో వచ్చి దిగేందుకు ప్రయత్నించారు. అయితే నీటి ఉద్ధృతికి కారు వరదనీటిలో కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు కారులోఉన్న రెండేళ్ల చిన్నారి, ముగ్గురు మహిళలను డోర్ గ్లాస్ లోంచి వారిని బయటికి తీశారు.
News September 19, 2025
HYD: 40 ప్రాంతాల్లో వరదలకు కారణం ఇదే..!

గ్రేటర్ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ జనాభాకు అవసరమైన స్థాయిలో లేకపోవడం, మరోవైపు సిల్ట్ భారీ మొత్తంలో పేరుక పోవడంతో అనేక చోట్ల నాలాలు పూడుకపోయాయి. ఇలాంటి పరిస్థితి దాదాపు 40 చోట్ల ఉన్నట్లు గుర్తించిన హైడ్రా ఎక్కడికక్కడ సిల్ట్ క్లియర్ చేయడంపై ఫోకస్ పెట్టినట్లు వివరించింది. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొంది.
News September 19, 2025
దసరా సెలవుల వేళ.. HYD విద్యార్థులకు గుడ్‌న్యూస్

దసరా సెలవులు వచ్చాయంటే విద్యార్థులకు ఆనందమే.. ఆనందం.. సిటీలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు సొంతూరికి వెళతారు. ఈ క్రమంలో వారు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వీటిని ఏర్పాటు చేశామన్నారు. బస్సుల వివరాల కోసం 9959226148, /6142, / 6136/ 6129 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.