News August 28, 2024
HYD: మరో పదేళ్లు మాదే అధికారం: మంత్రి
BRS నేతలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా వచ్చే పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని రంగారెడ్డి ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు KCR పాలన చూసి విసుగు చెంది BRSను ఓడించి, తమను గెలిపించారని మంగళవారం HYDలో ఒక ప్రకటనలో తెలిపారు. రుణమాఫీపై అసత్య ప్రచారం చేస్తూ రైతులను రెచ్చగొట్టడం మానుకోకపోతే మీకే నష్టమని హెచ్చరించారు. అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు.
Similar News
News January 21, 2025
శంషాబాద్: రికార్డు బ్రేక్ చేసిన ఎయిర్ పోర్ట్
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2025 జనవరి 18వ తేదీన ఒకే రోజు 94,630 మంది ప్రయాణికులను 607 విమానాల్లో గమ్యస్థానాలకు చేర్చి గత రికార్డును బ్రేక్ చేసినట్లుగా RGIA బృందం తెలిపింది. గత రికార్డు 2024 డిసెంబర్ 22వ తేదీన ఒకేరోజు 92,000 మంది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణించారు. గత డిసెంబర్ నెలలో 27 లక్షల మంది ప్రయాణించగా అందులో 23 లక్షల మంది స్వదేశీయులే అని తెలిపింది.
News January 21, 2025
HYD: రైల్వే ట్రాక్‌పై అమ్మాయి తల, మొండెం (UPDATE)
జామై ఉస్మానియాలో ట్రాక్ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు గ్రామానికి చెందిన భార్గవి(19)గా గుర్తించారు. OU ఆంధ్ర మహిళ సభలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు వెల్లడించారు. <<15212047>>ఆత్మహత్య<<>>కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News January 21, 2025
HYD: జామై ఉస్మానియా ట్రాక్‌పై అమ్మాయి మృతదేహం
సికింద్రాబాద్ జామై ఉస్మానియా రైల్వే ట్రాక్ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపింది. స్థానికుడు రాజు తెలిపిన వివరాలు.. ‘ఉదయం వాకింగ్‌కు వెళ్లగా రైల్వే ట్రాక్ మీద జనాలు గుమిగూడారు. ఏంటని వెళ్లి చూడగా ఓ అమ్మాయి తల, మొండెం వేరుగా పడి ఉంది. పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. సదరు యువతి ఓయూలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిసింది.’ అని రాజు పేర్కొన్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది