News September 22, 2025
HYD: మరో 3 గంటలు జర జాగ్రత్త..!

గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొడుతోంది. రానున్న 2-3 గంటలు ఈ వర్షం ఇలాగే కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మీ ప్రాంతంలో వర్షం కురుస్తుందా కామెంట్ చేయండి. SHARE IT
Similar News
News September 22, 2025
VKB: జాతీయ రహదారుల భూసేకరణ పూర్తి చేయాలి: కలెక్టర్

జాతీయ రహదారుల నిర్మాణాలకు భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో జాతీయ రహదారుల భూసేకరణపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రానున్న జాతీయ రహదారుల నిర్మాణాలకు అధికారులు వెంటనే భూసేకరణ పనులను పూర్తిచేయాలని కలెక్టర్ తెలిపారు.
News September 22, 2025
సీఎం సారూ.. మేడారం ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టండి!

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లు పరిశీలించేందుకు CM రేవంత్ మంగళవారం మేడారం రానున్నారు. కాగా, ప్రతి జాతర సమయంలో భక్తులను ట్రాఫిక్ జామ్ ప్రధాన సమస్యగా వేధిస్తుంటుంది. తాడ్వాయి-మేడారం, పస్రా-మేడారం రోడ్డు వెడల్పు చేస్తే ట్రాఫిక్ సమస్య ఉండదని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిత్యం ఈ మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై సీఎం స్పందించాలని కోరుతున్నారు.
News September 22, 2025
విశాఖలో కేంద్రమంత్రి స్వాగతం పలికిన కలెక్టర్

28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి (DARPG & DOPPW) జితేంద్రసింగ్ సోమవారం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆత్మీయంగా ఆహ్వానించారు.