News November 19, 2025
HYD: మరో 50 ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

నగరంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో GHMC ఇప్పటికే ఏర్పాటు చేసిన 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా మరో 50 ప్రాంతాల్లో ఈ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీ అయిన టీజీరెడ్కో జీహెచ్ఎంసీతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది.
Similar News
News April 14, 2026
విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్లు ప్రారంభం

విద్యార్థులకు, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో Vishwa Vishwani Institute of Systems and మేనేజ్మెంట్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది నూతనంగా BS Computer Science (UGC AEDP) కోర్సును ప్రారంభించారు. ఈ 4 సంవత్సరాల ప్రోగ్రామ్‌లో 2 ఏళ్లు క్యాంపస్‌లో చదువు, తదుపరి 2 సంవత్సరాలు ఇండస్ట్రీలో అప్రెంటిషిప్ శిక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 14, 2026
మామిడి రాకతో బాట‘సింగారం’

మామిడి పండ్లు బాటసింగారం బాట పట్టాయి. సోమవారం సుమారు వెయ్యి టన్నుల పండ్లు దిగుమతి అయినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. నగరంలోని మిగతా మార్కెట్లకు మరో 300 టన్నుల మామిడి వచ్చినట్లు అంచనా. ఈ ఏడాది పంట ఆలస్యమైనా ఏప్రిల్ 3వ వారం నుంచే నగర మార్కెట్లకు మామిడి రికార్డు స్థాయిలో దిగుమతి అవుతోంది. హోల్‌సేల్ మార్కెట్‌లోనే సోమవారం మామిడి పండ్ల ధర కిలో రూ.70-120 పలికింది.