News January 20, 2026
HYD: మల్లారెడ్డి కాలేజీలో గంజాయి కలకలం

మల్లారెడ్డి కాలేజ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, ఒకటిన్నర లీటర్ల హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు విద్యార్థులు మాదక ద్రవ్యాలు అమ్ముతుండగా, నలుగురు కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాలేజ్ నుంచి ఒడిశాకు వెళ్లి గంజాయి తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. మరో ఇద్దరు విద్యార్థులు పరారీలో ఉన్నారు.
Similar News
News February 10, 2026
HYD: నిరసనలు.. ఆందోళనలతో గడిచిపోయింది!

నేటితో ముగియనున్న GHMC పాలక మండలి.. నిరసనలు, ఆందోళనలతోనే గడిచిపోయింది. ఐదేళ్ల పదవీ కాలంలో పాలకమండలి 23సార్లు సమావేశమైంది. ఏడాదికి సరాసరి 4.6 సార్లు జరిగినట్లు లెక్క. ఈ సమావేశాలు జరుగుతున్నపుడు ప్రతిపక్ష పార్టీల సభ్యుల ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి. దీంతో సగం సమావేశాలు వాటితోనే ముగిశాయి. ఈ 5ఏళ్లలో 415 తీర్మానాలను పాలకమండలి ఆమోదించింది.
News February 10, 2026
HYD: చనిపోయినా పెన్షన్ ఇస్తాం.. వాడుకోండి

‘అయ్యో! మీరు చనిపోయారా.. ఏం పర్లేదు మీ పెన్షన్ డబ్బులు ఆగిపోవు.. మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. మీరు ఏ లోకంలో ఉన్నా వాడుకోవచ్చు’ ఇది సర్కారు తీరు. ఫతుల్లాగూడకు చెందిన జంగయ్య, బండ్లగూడకు చెందిన పోచయ్యలు ఎప్పుడో చనిపోయారు. అయినా వారి అకౌంట్లలో వృద్ధాప్య పెన్షన్ పడుతోంది. త్యాయగరాయనగర్‌కు చెందిన వీరభద్రయ్య(దివ్యాంగుడు) చనిపోయినా 5ఏళ్లుగా నెలకు రూ.4,016 జమ అవుతోందంటే మన అధికారుల తీరు అర్థం చేసుకోవచ్చు.
News February 10, 2026
IT కోటలో ఐఐటీయన్ల అడ్డా

మన హైదరాబాద్ గడ్డపై ఐఐటీయన్లు గట్టిగానే ప్లాన్ చేశారు. భారత్ ఏఐ ఇంపాక్ట్ సమిట్‌కు మద్దతుగా మార్చి 8న వెస్టిన్ హోటల్‌లో ‘పాన్-ఐఐటీ సదస్సు’ జరగనుంది. త్వరలో ఫ్రాన్స్‌లో జరిగే ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమానికి కూడా వీరు తోడుగా నిలవనున్నారు. ప్రభాత్ కుమార్ నేతృత్వంలో ఐఐటీ HYDలో కొత్త ఆఫీసు కూడా రాబోతోంది. ఆరోగ్యం, డిఫెన్స్ రంగాల్లో ఏఐ విప్లవంపై 600 మందికి పైగా నిపుణులు ఈ వేదికపై చర్చించనున్నారు.


