News September 6, 2025
HYD: మళ్లీ వస్తా.. మిమ్మల్నే చూస్తుంటా!

ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మఒడికి చేరాడు. ఆయనరాకతో 11 రోజుల పాటు నగరమంతా కలకలలాడింది. ఉత్సవాల్లో భాగమైన నిమజ్జనం అనివార్యం కావడంతో గంగమ్మ చెంతకు చేరాడు. ‘ఎప్పటిలాగే మీకోసం మళ్లీ వస్తా.. అప్పటిదాకా మిమ్మల్నే చూస్తుంటా’ అన్నంట్లున్న ఆయన చూపు అందరి హృదయాలను బరువెక్కించింది. ఈ మహా క్రతువును చూసేందుకు వేలాదిగా ప్రజలు హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చారు.
Similar News
News September 6, 2025
నిబద్ధతతో పనిచేస్తేనే మనుగడ: సిరిసిల్ల కలెక్టర్

నిబద్ధతో పనిచేస్తేనే వ్యవస్థ మనగడ సాధ్యమవుతుందని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో గ్రామ పాలన అధికారులకు శనివారం నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ ప్రభుత్వంలో చాలా కీలకమన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీలకు గ్రామ పాలన అధికారులను ప్రభుత్వం నియమించిందని జీపీఓలు క్షేత్రస్థాయిలో ప్రజలను నిబంధనల ప్రకారం మెరుగైన సేవలు అందించాలన్నారు.
News September 6, 2025
చంద్ర గ్రహణం కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దు

సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు శనివారం టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా రద్దు చేయడం జరిగిందనీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.
News September 6, 2025
28న BCCI మీటింగ్.. ప్రెసిడెంట్ ఎన్నికపై చర్చ!

రోజర్ బిన్నీ రాజీనామాతో బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో అధ్యక్ష ఎన్నికపై చర్చించేందుకు ఈనెల 28న బోర్డు సమావేశం కానుంది. అలాగే మిగతా పోస్టుల భర్తీపైనా చర్చించనుంది. అధ్యక్ష పదవికి ఎవరు పోటీ పడతారనేది ఇంకా తేలాల్సి ఉంది. కాగా అదేరోజు దుబాయ్‌లో ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. దీంతో భారత్ ఫైనల్‌కు వెళ్తే BCCI నుంచి ఎవరూ హాజరుకాకపోవచ్చు.