News July 21, 2024

HYD: మహంకాళికి బోనం సమర్పించిన కేంద్ర మంత్రి

image

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. రాష్ర్టంలో వందల ఏళ్ల నుంచి బోనాల పండుగ సంప్రదాయం జరుపుతున్నామన్నారు. ఎక్కడా లేని బోనాల పండుగ మనకు మాత్రమే ప్రత్యేకమని అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

Similar News

News October 2, 2024

HYD: మహనీయులకు నివాళులర్పించిన బీఆర్ఎస్ అగ్రనేతలు

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ అగ్రనాయకులతో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీలకు తెలంగాణ భవన్లో నివాళులర్పించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, పార్టీ నాయకులు, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్ తదితర ప్రముఖులతో కలిసి ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు.

News October 2, 2024

HYD: బాపు‌ఘాట్‌లో గవర్నర్ నివాళులు

image

సత్యం, అహింస, ప్రేమ, స్వచ్ఛత అనే విలువలకు కట్టుబడి ప్రజలు మహాత్మా గాంధీ కలలు కన్న భారతం సాకారం చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ వద్ద గవర్నర్ మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని నివాళులర్పించారు.

News October 2, 2024

HYD: మూసీ ప్రజలు నిశ్చింతంగా ఉండండి: మధుయాష్కి

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇంటిని అక్రమంగా కూల్చదని దానికి నాది గ్యారెంటీ అని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇళ్లు ఇచ్చే ప్రభుత్వమని, ఎవరి ఇళ్లు కూలగొట్టదని పేర్కొన్నారు. ఇళ్ల పైకి ఒక్క గడ్డపార రాదని.. ఒక జేసీబీ కూడా రాకుండా చూసే బాధ్యత తమదని అన్నారు.