News February 19, 2025

HYD: మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. భక్తుల సౌకర్యార్థం ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్, రక్సౌల్‌కు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ రైళ్లు ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు అందుబాటులో ఉంటాయి. రైళ్ల రాకపోకల వివరాలు.. తేదీల కోసం పైన పేర్కొన్న పట్టికను చూడండి. ఈ రైళ్ల రాకపోకల సమాచారం కోసం SCR వెబ్‌సైట్ చూడొచ్చు.

Similar News

News July 6, 2025

HYD: త్వరలో వాట్సప్ బస్ టికెట్

image

గ్రేటర్ HYDలో త్వరలో వాట్సప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ RTC బస్ టికెట్ విధానం అందుబాటులో ఉంది. జస్ట్ QR కోడ్ స్కాన్ చేసి, ఫోన్లో పేమెంట్ చేస్తే టికెట్ వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో ఒక భాగం. ఈ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు.

News July 6, 2025

బోరబండలో భార్యను హత్య చేసిన భర్త

image

HYD బోరబండ PS పరిధిలో భార్యను భర్త హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. సోనీ, నర్సింలు దంపతులు. మద్యానికి బానిసై నర్సింలు తాగివచ్చి తరుచూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ నేపథ్యంలో భార్య సోనీ తన పుట్టింటికి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత 3 రోజులుగా మళ్లీ చిత్రహింసలు పెడుతూ విచక్షణారహితంగా కొట్టడంతో సోనీ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 6, 2025

HYD: నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు

image

మొహరం నేపథ్యంలో బీబీ కా ఆలం ఊరేగింపులో భాగంగా నేడు HYDలోని సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని మ్యూజియం అడ్మినిస్ట్రేటివ్ అధికారి తెలిపారు. అదేవిధంగా బీబీ కా ఆలం ఊరేగింపు చార్మినార్ ప్రధాన మార్గాల్లో కొనసాగనున్న నేపథ్యంలో చార్మినార్‌లోకి ప్రవేశం ఉండదన్నారు. సోమవారం తిరిగి సాలార్ జంగ్ మ్యూజియంలోకి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు.

-SHARE IT