News November 24, 2024

HYD: మహిళపై SI వేధింపులు..!

image

HYDలోని ఓ SI వేధిస్తున్నారని గృహిణి సీపీ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ప్రకారం.. ‘నా భర్త వేధింపులు తాళలేక PSలో ఫిర్యాదు చేశాను. అందులోని నా మొబైల్ నంబర్ తీసుకుని SI పర్సనల్ మెసేజులు చేస్తూ వేధిస్తున్నారు’ అని వాపోయారు. ‘నీ కేసు నేను పరిష్కరిస్తా.. మీ ఇంటికి వస్తా’ అంటూ అసభ్యంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.

Similar News

News November 24, 2024

జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు గడువు పొడిగింపు

image

గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు గడువు ఈ నెల 28 వరకు పొడిగించినట్లు సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఈ నెల 25 కాగా శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవు అయినందున చాలా మంది డీడీలు తీయలేక పోయినట్లు తెలుస్తోందని, అందుకే మరో మూడు రోజులు పొడగించినట్లు నిర్వాహకులు చెప్పారు.

News November 24, 2024

GHMCలో కుక్కల బోన్లు చూశారా..?

image

గ్రేటర్ HYDలోని ఆరు జోన్ల పరిధిలో అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ప్రత్యేకంగా కుక్కల జైళ్ల మాదిరి బోన్లు అందుబాటులో ఉంచారు. కుక్కల బెడదపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, కుక్కలకు వ్యాక్సినేషన్ అందించి, వ్యాధులు ఉన్న కుక్కలను గుర్తించి వాటిని ఇక్కడ ఉంచి వైద్యం అందిస్తున్నారు. మరికొన్నింటికి స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 24, 2024

HYD: 15 ఏళ్లు దాటితే సీజ్ చేయండి: మంత్రి

image

15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేయాలని ఖైరతాబాద్‌లో జరిగిన మీటింగ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా ఫిట్‌నెస్, ఇన్స్యూరెన్స్, RC సహా అన్ని పత్రాలు చెక్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 వేల స్కూల్ బస్సులపై నివేదిక ఇవ్వాలన్నారు. 62 రవాణా శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు, మౌలిక వసతులపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.