News December 30, 2025

HYD: మహిళలకు ఉచిత శిక్షణ

image

HYDలో మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదంగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం, HYD పోలీసుల సహకారంతో MOWO Social Initiatives భాగస్వామ్యంతో ప్రత్యేక డ్రైవర్ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. మహిళా ప్రయాణికుల కోసం బైక్ టాక్సీ, e-ఆటో డ్రైవింగ్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. ఉచిత శిక్షణ, లైసెన్స్ సాయం, వాహన లీజ్/ లోన్ సదుపాయం అందించనున్నారు. JAN3న అంబర్‌పేట్ PTCలో ఈ మేళా జరగనుంది.

Similar News

News January 1, 2026

HYD: 2026.. మన స్టైల్లో ఎంజాయ్ చేద్దాం!

image

అతిగా ఆలోచించి బుర్ర పాడుచేసుకునే రోజులకు Gen Z చెక్ పెడుతోంది. స్క్రోలింగ్ మానేసి కిక్కు ఇచ్చే Y2K గ్లో-అప్స్, మీమ్ థెరపీ, ఫ్రెండ్స్‌తో గేమింగ్ నైట్స్‌కి యూత్ ఫిక్స్ అయిపోతుంది. మెంటల్ హెల్త్ పాడుచేసే టాక్సిక్ ట్రెండ్స్‌ను ఘోస్ట్ చేస్తూ సస్టైనబుల్ స్నాక్స్, సెల్ఫ్ కేర్ హ్యాక్స్‌తో తమ ‘మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ’ చాటుకుంటున్నారు. ఇలానే 2026 కొత్త ఏడాదిని మన స్టైల్‌లో ఎంజాయ్ చేద్దాం.
Happy New Year

News December 31, 2025

HYD: 2025లో అందాలు.. అద్భుతాలు.. కన్నీళ్లు!

image

❤︎HYD మెట్రో ఫేజ్-2 పనులు(JAN)
❤︎హైటెక్స్‌లో మిస్ వరల్డ్-2025(MAY)
☹︎గుల్జార్‌హౌస్ ప్రమాదం.. 17 మంది మృతి(MAY)
❤︎సరూర్‌నగర్‌లో బతుకమ్మ వరల్డ్ రికార్డ్(SEP)
☹︎చేవెళ్ల యాక్సిడెంట్.. 17 మంది మృతి(NOV)
☹︎సౌదీలో యాక్సిడెంట్.. 45 మంది హైదరాబాదీలు మృతి
⊘IBOMMA రవి అరెస్ట్(NOV)
❤︎ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ HYD టూర్(DEC)
❤︎గచ్చిబౌలి స్టేడియంలో సూపర్ క్రాస్ రేసింగ్(DEC)
❤︎తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(DEC)

News December 31, 2025

BIG BREAKING: GHMC ఖేల్ ఖతం!

image

HYD ఒక మహా నగరం. పాలనలో వేగం కోసం ఇప్పుడు ‘గ్రేటర్’ విడిపోక తప్పేలా లేదు. FEB 9 వరకు ప్రస్తుత GHMC టీమ్ కొనసాగుతుందని ఆఫీసర్లు తేల్చి చెప్పేశారు. ఆ గడువు ముగియగానే నగరాన్ని కనీసం 3 లేదా 4 మున్సిపల్ కార్పొరేషన్లుగా విడగొట్టేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధమైంది. ఇప్పటికే 106 ప్రాంతాల సరిహద్దులను మార్చేసి, మరో 30 ఏరియాలకు కొత్త పేర్లు కూడా ఫిక్స్ చేసేశారు. మన హైదరాబాద్‌ మ్యాప్ మారుతోంది.. రెడీగా ఉండండి!