News September 20, 2025

HYD: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: భట్టి

image

రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు HYD యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మహిళలను ఆర్థిక, సామాజిక శక్తివంతీకరణ, వ్యాపార శిక్షణ ఇచ్చి, కోటీశ్వరులుగా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

Similar News

News September 20, 2025

HYD: పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్‌కు వినతి

image

పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్‌ను పంచాయితీ కార్యదర్శులు శనివారం HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. 317 జీవోతో పంచాయతీ కార్యదర్శులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. 317 జీవోతో నష్టపోయిన పంచాయితీ కార్యదర్శులకు 190 జీవో ప్రకారం తాత్కాలిక డిప్యూటేషన్లు, కల్పించాలని కోరారు. దేనికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

News September 20, 2025

HYD: MBA, MCA సీట్లు వేలకొద్దీ మిగిలాయి..!

image

కౌన్సెలింగ్ అనంతరం రాష్ట్రంలో MBA, MCA సీట్లు వేలకొద్దీ మిగిలాయి. ఐసెట్ తుది దశ కౌన్సిలింగ్ ముగిసే సరికి MBAలో 4,456 సీట్లు, MCAలో 2,504 సీట్లు మిగిలాయి. ఇదిలా ఉండగా సీట్లు పొందిన విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈనెల 23వ తేదీలోపు ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన HYDలో తెలిపారు. 

News September 20, 2025

HYD: మెట్రో రైల్ VS సర్కార్

image

మెట్రో రైల్ నిర్వహణ.. ఇపుడు నగరంలో హాట్ టాపిక్. మెట్రోకు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది.. ఇవ్వకపోతే ఎలా నడపాలని నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ చెబుతోంది. మీరే తీసుకోండి అని ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే మేమెందుకు తీసుకుంటాం? అని డైరెక్టుగా ముఖ్యమంత్రే ఢిల్లీలో ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న ప్రాజెక్టును నడపడం సాధ్యం కాదు అని పేర్కొన్నారు.