News July 9, 2025
HYD: మహిళలు.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి

మహిళలకు అండగా రాచకొండ షీ టీమ్స్ ఉంటుందని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. గత 15 రోజుల్లో 185 మంది పొకిరీలను షీ టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 215 ఫిర్యాదుల్లో 9 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. మెట్రో, బస్టాండ్లలో షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లను నిర్వహిస్తోందని, మహిళలు వేధింపులకు గురైతే రాచకొండ వాట్సప్ నం. 8712662111కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News July 9, 2025
BREAKING.. మరిపెడ మండలంలో ఎన్ఐఏ సోదాలు

MHBD జిల్లా మరిపెడ మం.లోని భూక్య తండాలో NIA సోదాలు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి ఆ తండాలో మిర్చి ఏరడానికి వచ్చిన వ్యక్తి జిలటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాన్ని తీసుకువెళ్లి తీవ్రవాదులకు అమ్ముతున్నట్లు అక్కడి పోలీసులు గుర్తించి అతడిని పట్టుకున్నారు. ఇక్కడి రైతు దగ్గర తీసుకున్నట్లు NIA అధికారులకు విచారణలో చెప్పడంతో అధికారులు ఇక్కడికి వచ్చి సోదాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 9, 2025
మేడిగడ్డ కూలిపోవాలనే గాలికొదిలేశారా?: బీఆర్ఎస్

TG: కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని BRS ఆరోపించింది. ‘మేడిగడ్డపై సెక్యూరిటీని తొలగించడంతో బ్యారేజీపైన వాహనాలు యథేచ్చగా తిరుగుతున్నాయి. భారీ వాహనాల వల్ల పిల్లర్లపై ఒత్తిడి పడి కొట్టుకుపోవాలనేదే కాంగ్రెస్ కుట్ర. దీనిని పనికిరాని ప్రాజెక్టుగా చూపించి KCRను దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. ఏపీ ప్రయోజనాలకు గోదావరి నీటిని బహుమతిగా ఇవ్వాలనే రెండో ప్లాన్ ఉంది’ అని రాసుకొచ్చింది.
News July 9, 2025
ఖమ్మం జిల్లాలో తగ్గిన ఎంపీటీసీ స్థానాలు

ఖమ్మం జిల్లాలో MPTCల సంఖ్య తేలింది. గత ఎన్నికల్లో 289 స్థానాలుండగా ప్రస్తుతం 284కు తగ్గాయి. జిల్లాలో కల్లూరు, ఎదులాపురం మున్సిపాలిటీలుగా ఏర్పడటంతో సంఖ్య తగ్గింది. కల్లూరులో 5 స్థానాలు తగ్గటంతో 13 స్థానాలతో అధికారులు డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో కల్లూరులో 18 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. అటు ఎదులాపురంలోని గ్రామాలన్నీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రావటంతో పెద్దగా MPTCల సంఖ్య మారలేదు.