News October 4, 2025

HYD: మహిళల్లో థైరాయిడ్.. ఇలా చేయండి

image

మేడ్చల్ మల్కాజిగిరిలో స్వస్త్ నారీ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా మహిళలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. చాలా మందిలో థైరాయిడ్‌ను గుర్తించామని డా.శ్రీదేవి వెల్లడించారు. అధిక బరువు ఉన్న వారిలో ఈ సమస్య ఉందన్నారు. లైఫ్‌స్టైల్ ఛేంజస్‌తో గాడిలో పెట్టొచ్చు. నిత్యం 3KM నడక, సీఫుడ్స్, సీడ్స్& నట్స్, సెలీనయం ఉండే ఆహారం తీసుకోవాలి. సమయానికి మంచి నిద్ర, ఆహారానికి నిద్రకు మధ్య కనీసం 2గంటల గ్యాప్ ఉండాలని వివరించారు.

Similar News

News October 4, 2025

HYD: తగ్గిన డోర్ డెలివరీ డొమెస్టిక్ సిలిండర్లు..!

image

HYD, RR, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో మొత్తం కలిపి ప్రధాన 3 సంస్థలకు సంబంధించిన డొమెస్టిక్ సిలిండర్ సుమారు 40 లక్షల వరకు ఉన్నాయి. అయితే.. వాణిజ్య కనెక్షన్లు మాత్రం లక్షకు మించి లేవని అధికారిక గుణంకాలు చెబుతున్నాయి. HYDలో 165 LPG ఏజెన్సీలు ఉండగా ప్రతిరోజు 1- 3 లక్షల డొమెస్టిక్ సిలిండర్ల డిమాండ్ ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ.. ప్రస్తుతం 60 వేలకు మించి డోర్ డెలివరీ కావటం లేదు.

News October 4, 2025

ఇదయ్యా! మా హైదరాబాద్ రోడ్ల దుస్థితి

image

లక్డికాపూల్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు దెబ్బతింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం RTC ఎలక్ట్రిక్ బస్ అందులో దిగబడింది. దీంతో అక్కడ ఉన్న పోలీసులు, ఇతర సిబ్బంది కలిసి బస్సును కదిలించారు. నిత్యం ఈ పాత్ హోల్స్ కారణంగా వందల్లో బైకులు, కార్లు దెబ్బతింటున్నాయని, నడుములు పోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదయ్యా! మా HYD రోడ్ల దుస్థితి అని SMలో చర్చించుకుంటున్నారు.

News October 4, 2025

HYD: అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన నైజీరియన్

image

ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన నైజీరియన్ జియోఫ్రీ డోజియోబిబ్‌ను ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రిపోర్ట్ చేశారు. నైజీరియా నుంచి నేపాల్ కు వచ్చి అక్కడ నుంచి నగరానికి చేరుకొని డ్రగ్స్ పెడ్లర్స్ తో కలిసి తిరుగుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో టోలిచౌకిలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముంబై విమానాశ్రయం నుంచి నైజీరియాకు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా పంపారు.