News October 28, 2025
HYD మహిళాశక్తి క్యాంటీన్ల అవగాహనకు స్పెషల్ టీం

నగరంలో మహిళా శక్తి క్యాంటీన్లకు సంబంధించి ఆర్థిక స్వావలంబన, మహిళల స్వాతంత్ర్యానికి నిదర్శనంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్య దేవరాజన్ ప్రత్యేకంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటిని పరిశీలించినట్లు తెలిపారు. వీటిపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నారు.
Similar News
News October 28, 2025
తుఫాన్ ప్రభావంతో నేషనల్ హైవే 16పై వాహనాల నిలిపివేత

మొంథా తుఫాన్ ప్రభావంతో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత కోసం ఈరోజు రాత్రి 7 గంటల నుంచి నేషనల్ హైవే 16పై అన్ని వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో నిలిపివేయాలని సూచించారు. అత్యవసర సేవల వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.
News October 28, 2025
4,155 మందికి పునరావాసం: కలెక్టర్

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 37 పునరావాస కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం నాటికి 4,155 మంది బాధితులకు భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 3,581 ఎకరాల వరి పొలాల్లో వర్షపు నీరు చేరిందని, జిల్లాలో తుఫాను కారణంగా 10 గ్రామాలు ముంపునకు గురి కాగలదని గుర్తించడం జరిగిందని ఆమె వెల్లడించారు.
News October 28, 2025
‘విధులకు హాజరు కాని ముగ్గురు డాక్టర్లకు మెమోలు జారీ’

ప్రభుత్వ డాక్టర్లు విధులకు సరిగా హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో దేవి హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో సరిగా విధులకు హాజరుకాని వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. జిల్లాలోని తిమ్మంపల్లి, నాగసముద్రం, బొమ్మనహాల్ వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాప్ విధుల్లో లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


