News February 7, 2026

HYD: మహిళా ఇంజినీర్లకు బంపర్ ఆఫర్

image

HYD ఐఐఐటీలోని ఐహబ్‌-డేటా మహిళా గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించింది. (AI), మెషీన్‌ లెర్నింగ్‌ (ML) అంశాలపై 6 నెలల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. మార్చిలో ప్రారంభమయ్యే ఈ కోర్సులో ప్రతి సోమవారం క్యాంపస్‌లో తరగతులు ఉంటాయి. ప్రతిభ కనబరిచిన వారికి మూడు నెలల ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తారు. ఫిబ్రవరి 20లోగా https://ihub-data.ai వెబ్‌సైట్‌‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News February 20, 2026

HYD: మోగనున్న పెళ్లి బాజాలు.. వాటికి ఫుల్ డిమాండ్

image

డిసెంబర్ నుంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలు నిలిచిపోయాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను చాలావరకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈనెల 17తో శుక్రమౌఢ్యమి అమావాస్య ముగిసింది. దీంతో HYD, ఉమ్మడి రంగారెడ్డిలోని ఫంక్షన్ హాళ్లు, వివాహాలకు సంబంధించి కొనుగోళ్లతో వస్త్ర, బంగారు దుకాణాలలో రద్దీ పెరిగింది. ముహూర్తాలు మొదలు కావడంతో డెకరేషన్, ఫొటోగ్రఫి, ఈవెంట్లు నిర్వాహకులు తీరిక లేకుండా ఉన్నారు.

News February 20, 2026

HYD: 60% వరకు రాయితీతో బైకులు

image

PM మత్స్య సంపద యోజన కింద HYD జిల్లాలో అర్హతగల మత్స్యకారులకు 16 బైకులు (ఐస్ బాక్స్‌తో) మంజూరు చేసినట్లు జిల్లా మత్స్యశాఖాధికారి రజిని తెలిపారు. ఒక్క యూనిట్ విలువ రూ.75,000 అని స్పష్టంచేశారు. జనరల్‌, SC/STలకు 40% (రూ.30వేలు), మహిళలకు 60% (రూ.45వేలు) రాయితీ ఉంటుంది. చేపల అమ్మకంలో అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఆసక్తిగల వారు ఫిబ్రవరి 26లోగా మాసబ్‌ట్యాంక్‌ మత్స్యభవన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

News February 20, 2026

రంజాన్ మాసంలో చార్మినార్‌కు కొత్త అందాలు

image

రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో షాపింగ్ స్టాల్స్ సందడిగా మారాయి. హోల్ సేల్ వస్త్రాల మార్కెట్‌గా పేరుగాంచిన మదీనాతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాలల్లో దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో షాపులకు రద్దీ పెరిగింది. చార్మినార్‌ను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు.