News November 12, 2025
HYD మహిళా ఉద్యోగినుల కోసం ఉచిత ఆరోగ్య సదస్సు

గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే పోస్టర్‌ను టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా కమిటీ ఈ రోజు విడుదల చేసింది. జిల్లా మహిళా ఉద్యోగుల కోసం నవంబర్ 25న ఉచిత ఆరోగ్య సదస్సు ఉంటుందని యూనియన్ నాయకులు మారమ్ జగదీశ్వర్, డా.ఎస్.ఎం. హుస్సేని ప్రకటించారు. ఉద్యోగినులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని కోరారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Similar News
News November 13, 2025
HYD: వలపు వల.. మగవాళ్లు జాగ్రత్త!

HYDలో వలపు వల విసిరి అమాయకుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందంతో కట్టి పడేయడం, అడ్డదారిలో లాగేయడం ఓ దందాగా మారింది. వాట్సాప్, టెలిగ్రామ్‌లో చాట్ చేస్తూ.. పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తున్నారు. గంజాయి సరఫరా, ఉద్యోగం ఇప్పిస్తాం, కన్సల్టెన్సీ అని చెబుతూ డబ్బులు అకౌంట్లో పడ్డాక సైడ్ అవుతున్నారు. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.
SHARE IT
News November 13, 2025
HYD: హోమియో ఆసుపత్రిలో ఆర్థరైటిస్, సోరియాసిస్‌కు వైద్యం!

రామంతాపూర్ హోమియో వైద్య కళాశాలలో హోమియో వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చు. 1, 3, 4, 5 గదులలో ఆర్థరైటిస్, సోరియాసిస్, ఫంగస్ ఇన్‌ఫెక్షన్, స్పాండిలైటిస్ లాంటి సమస్యలకు పరిష్కారం చూపుతారు. అంతేకాక అల్సర్‌కు సైతం వైద్యం అందిస్తున్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు.
SHARE IT
News November 13, 2025
HYD: గెట్ రెడీ.. రేపే కౌంటింగ్

రేపు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. సెగ్మెంట్‌లో 4,01,365 ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,94,631(48.49%) మాత్రమే ఓటు వేశారు. 10 రౌండ్లు, 42 టేబుళ్ల మీద కౌంటింగ్ ఉంటుంది. షేక్‌పేటలోని 1వ బూత్‌తో మొదలై ఎర్రగడ్డలోని 407 బూత్‌తో కౌంటింగ్ ముగియనుంది. సీసీ కెమెరాల నిఘాలో ఈ ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు జూబ్లీహిల్స్ MLA ఎవరో తేలనుంది.


