News December 17, 2024

HYD: మాదకద్రవ్యాలను వినియోగిస్తే చర్యలు

image

న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాచకొండ పోలీసులు సూచించారు. ఈ వేడుకల్లో మాదకద్రవ్యాలను వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫామ్ హౌస్‌లతో పాటు పబ్‌ల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయనున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.

Similar News

News November 4, 2025

రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం

image

రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు షేక్‌పేట్ డివిజన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి కార్నర్‌ మీటింగ్‌కు హాజరవనున్నారు. రాత్రి 8 గంటలకు రహమత్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్‌ షోతోపాటు కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొని ప్రచారం చేయనున్నారు.

News November 4, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు

image

HYD బుద్ధభవన్‌లో నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా అదనపు కమిషనర్ అశోక్ కుమార్ ఈరోజు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారన్నారు. మల్లాపూర్,సాయినగర్, ఎంఎర్‌టౌన్‌షిప్, మణికొండ, గుట్టలబేగంపేట ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడాలని కోరారని, చర్యలు తీసుకుంటామన్నారు.

News November 4, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై హరీశ్‌రావు మీటింగ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి నడుమ సిద్దిపేట BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. రహమత్‌నగర్ డివిజన్‌పై వ్యూహరచన కోసం హరీశ్‌రావు నివాసంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో నేతలు, ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఉపఎన్నిక ఫలితంపై నిర్ణాయకంగా ప్రభావం చూపే డివిజన్‌లలో మరింత బలోపేతం, బూత్‌ల వారీ సమన్వయం చేసుకోవాలన్నారు.