News February 27, 2025
HYD: మానసికంగా ఒత్తిడి ఉందా..? కాల్ చేయండి!

HYD, MDCL, RR జిల్లావాసులు ఒత్తిడికి గురవడం, మానసికంగా ఆవేదన చెందడం వంటి సమస్యలను ఎదుర్కొంటే టెలీ మానస్ హెల్ప్‌లైన్ 14416కు కాల్ చేయాలని ఉప్పల్ పీహెచ్సీ డాక్టర్ సౌందర్యలత తెలిపారు. నిష్ణాతులైన వైద్యులు సలహాలు సూచనలు అందజేస్తారు. మీ పిల్లల ప్రవర్తనలో ఏవైనా మానసిక తేడాలు గుర్తించినా కాల్ చేయొచ్చన్నారు. మానసిక సంబంధిత అంశాలన్నింటికి పరిష్కారం ఉంటుందని, ఈ విషయాన్ని అందరికీ తెలపాలని కోరారు.
#SHARE IT.
Similar News
News September 9, 2025
ఉమ్మడి RR ఏఎంసీ ఛైర్మన్ల గౌరవ అధ్యక్షుడిగా పెంటయ్య

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏఎంసీ ఛైర్మన్ల గౌరవ అధ్యక్షుడిగా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పెంటయ్య గౌడ్ ఎన్నికయ్యారు. పలు మండలాల ఏఎంసీ ఛైర్మన్లు ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తనను ఏకగ్రీవంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏఎంసీ ఛైర్మన్ల గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వారందికీ ధన్యవాదాలు తెలిపారు.
News September 9, 2025
మాజీ సీఎం కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలి: రాజాసింగ్

హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హుస్సేన్‌సాగర్‌ను కొబ్బరినీళ్లతో నింపుతామన్న కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను వేరే చోటికి తరలిస్తే సాగర్‌ను మంచినీటితో నింపవచ్చని సూచించారు.
News September 8, 2025
RR: పింఛన్‌దారులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్

అధికారంలోకి రాగానే పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టి 2 ఏళ్లు కావస్తున్నా పింఛన్ పెంచకుండా మోసం చేస్తున్నట్లు MRPS చీఫ్ మందకృష్ణ మాదిగ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు పింఛన్‌దారులతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ సర్కార్ వెంటనే పింఛన్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.