News February 12, 2025

HYD: మార్చి మొదట్లోనే మామిడి పండ్లు..!

image

HYD శివారులో బాటసింగారం అతిపెద్ద పండ్ల మార్కెట్ మామిడి పండ్ల సీజన్ కోసం సిద్ధమవుతోంది. దాదాపు 19 ఎకరాలకు మించిన స్థలంలో ఈ మార్కెట్ సిద్ధం చేస్తున్నట్లు మార్కెట్ యజమాన్యాలు తెలిపారు. ఇప్పటికే షెడ్లను నిర్మించారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. ఏపీ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ మహారాష్ట్ర ఉత్తర్‌ప్రదేశ్ నుంచి మన HYDకి ఈసారి మార్చి మొదట్లోనే మామిడి పండ్లు రానున్నాయి.

Similar News

News February 12, 2025

NZB: తాళం వేసిన ఇంట్లో చోరీ

image

ఇంటికి తాళం వేసి కుటుంబం కుంభమేళాకు వెళ్లగా గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్‌లో జరిగింది. కంఠేశ్వర్ బైపాస్ రోడ్‌లో నివాసం ఉండే శేఖర్ కుటుంబంతో కలిసి సోమవారం కుంభమేళాకు వెళ్లారు. కాగా అదే రాత్రి దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోని 2 తులాల బంగారం, 40 వేల నగదు అపహరించినట్లు బాధితుడు తెలిపారు.

News February 12, 2025

MBNR: రెండు రోజులకు శవమై తేలింది!

image

ఇంట్లో గొడవపడి బయటికెళ్లిపోయిన మహిళ శవమై తేలిన ఘటన గండీడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. పగిడ్యాల్‌కి చెందిన పద్మమ్మ(38) ఆదివారం ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు అలిగి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆమె జాడ కనిపించలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత పగిడ్యాల్ మల్లమ్మచెరువులో శవమై తేలింది. పద్మమ్మకు భర్త, ముగ్గరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదైంది.

News February 12, 2025

పల్నాడులో తగ్గిన చికెన్ ధరలు 

image

పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ ధరలు దిగివస్తున్నాయి. 10 రోజుల క్రితం కేజీ చికెన్ రూ.280 వరకు ఉంది. ప్రస్తుతం ఈ ధర రూ. 240-260 వరకు విక్రయిస్తున్నారు. తెలంగాణ, గోదావరి జిల్లాల నుంచి దిగుమతి అవుతున్న కోళ్లకు సంబంధించి వ్యాపారులకు లైవ్ కోడి కేజీ రూ.50-60లు, చికెన్ రూ. 150-160ల వరకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ధర తక్కువ ఉన్న చికెన్ పట్ల ప్రజలలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

error: Content is protected !!