News March 6, 2025

HYD: మార్చి 8న వాటర్ బంద్

image

BHEL జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తున్న కారణంగా ఈనెల 8న నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని HMWSSB అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎర్రగడ్డ, SRనగర్, HBకాలనీ, మూసాపేట, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, అశోక్‌నగర్, RCపురం, లింగంపల్లి, చందానగ, మదీనాగూడ, మియాపూర్, గంగారం, జ్యోతినగర్, బీరంగూడ, శ్రీనగర్, అమీన్‌పూర్, నిజాంపేట్‌‌లో అంతరాయం ఉంటుందన్నారు.

Similar News

News December 19, 2025

జగిత్యాల: ‘రుణాలు మంజూరు చేయుటకు UBI సిద్ధం’

image

అర్బన్ మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయుటకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉన్నట్లు జగిత్యాల డిప్యూటీ రీజనల్ హెడ్ శ్రీలత తెలిపారు. అర్హులైన SHGల రుణ దరఖాస్తులను ఈ నెల 24లోపు పంపాలని సూచించారు. PM వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ పథకం కింద దరఖాస్తులను పరిశీలించి వెంటనే రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. SHG రుణ లక్ష్య సాధనకు కృషి చేసిన రిసోర్స్ పర్సన్లను అభినందించారు.

News December 19, 2025

జగిత్యాల జిల్లాలో మాక్ డ్రిల్ నిర్వహణకు ఏర్పాట్లు

image

డిసెంబర్ 22న నిర్వహించనున్న విపత్తుల నిర్వహణ మాక్ డ్రిల్‌ను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. ముందస్తు అప్రమత్తత, సమన్వయ చర్యలతో ప్రాణాలు, ఆస్తి నష్టాలు తగ్గించవచ్చని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో అధికారులు సిద్ధంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

News December 19, 2025

ఐదో టీ20: టాస్ ఓడిన భారత్

image

అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న ఐదో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియాలో హర్షిత్, గిల్, కుల్దీప్ స్థానాల్లో బుమ్రా, శాంసన్, సుందర్ వచ్చారు.

IND: సూర్య(C), శాంసన్, అభిషేక్, తిలక్, పాండ్య, జితేశ్, సుందర్, దూబే, వరుణ్, బుమ్రా, అర్ష్‌దీప్