News February 18, 2025

HYD: మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలి: సీఎం

image

గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీలో జరుగుతున్న షీల్డ్ 2025 సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలని, ఒకప్పుడు ఇంట్లో చొరబడి మాత్రమే దోపిడీలు చేసేవారని, ఇప్పుడు దొంగలు ఎక్కడో ఉండి మన సొమ్ము దోచేస్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థ దేశం మొత్తం ఒక యూనిట్‌గా పని చేస్తేనే సైబర్ నేరాలను అరికట్టగలమన్నారు.

Similar News

News March 12, 2025

డా.N. యువరాజ్‌కు నెల్లూరు జిల్లా బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా ప్రత్యేకాధికారిగా డా.N.యువరాజ్ IAS నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్‌కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు.

News March 12, 2025

తూ.గో. జిల్లాకు ప్రత్యేక అధికారి

image

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్‌ IAS అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా ప్రవీణ్ కుమార్‌ను తూ.గో.జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ప్రభుత్వం కేటాయించింది. జోనల్ ఇన్‌ఛార్జ్‌గా అజయ్ జైన్‌ను నియమించింది. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 12, 2025

వచ్చే నెల అమరావతికి ప్రధాని మోదీ!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో రాజధాని అమరావతి పనులను పున:ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ప్రధాని కార్యాలయం అమరావతి పర్యటన తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజధాని పనులను అట్టహాసంగా మళ్లీ స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 9ఏళ్ల కిందట అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!