News September 11, 2025

HYD: మీరు వినరు.. వారు వదలరు

image

గణేశ్ ఉత్సవాల్లో హైదరాబాద్ షీ టీమ్స్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. 1,612 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొంది. పట్టుబడ్డ వారిలో 1,544 మంది పెద్దలు, 68 మంది ఉన్నారు. ఇందులో 168 పెట్టి కేసులు నమోదు చేయగా.. 70 కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొందరికి జరిమానా, ఒకరికి 2 రోజుల సింపుల్ జైలు శిక్ష, 1,444 మందికి వార్నింగ్, కౌన్సెలింగ్ కోసం పిలిచి అవగాహన కల్పించారు.

Similar News

News September 11, 2025

జగిత్యాల జిల్లాలో 20 జడ్పీటీసీ, 216 ఎంపీటీసీ స్థానాలు

image

జగిత్యాల జిల్లాలో కొత్తగా ఏర్పడిన భీమారం, ఎండపల్లి మండలాలతో కలిపి మొత్తం 20 మండలాలకు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. గతంలో 18 ఎంపీపీ, 18 జడ్పీటీసీ స్థానాలుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 20కి చేరింది. పునర్వ్యవస్థీకరణ అనంతరం 214కు బదులుగా 216 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటయ్యాయి. మండలంలో కనీసం ఐదుకు తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

News September 11, 2025

KMR: ఊట బావులు.. ఊసే లేదు

image

గ్రామీణ ప్రాంతాల్లో ఊట బావులు కనుమరుగైపోతున్నాయి. పూర్వం ఊట బావుల ద్వారా ప్రజలు నీటి అవసరాలు తీర్చుకునే వారు. ఆధునిక పరిజ్ఞానం పెగడంతో చాలా మంది ఊట బావులపై అశ్రద్ధ చూపడం వల్ల వాటిని పట్టించుకోవడం లేదు. పొలాలు, ఇళ్ల వద్ద ఊట బావులను నిర్మించుకుంటే బావుల్లో నీరు చేరి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీలో ఊట బావులు తవ్విస్తున్నారు.

News September 11, 2025

వనపర్తి ఎమ్మెల్యే ఫేక్ ఐడీతో సైబర్ నేరగాళ్ల మోసం

image

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేరుతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. మోసగాళ్లు ఎమ్మెల్యే మాట్లాడుతున్నట్లు మెసేజ్‌లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తెలిపింది. ఈ అకౌంట్‌తో జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ స్పందించవద్దని హెచ్చరించారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే ఎమ్మెల్యేకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.