News February 14, 2026

HYD: మీలాంటి వ్యక్తి మీ కూతురుకి భర్తగా వస్తే?

image

HYDలో 3 ముళ్ల బంధాలు మున్నాళ్ల ముచ్చటవుతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడమే కారణంగా తెలుస్తోంది. నిపుణుల సలహా ఏంటంటే.. మీ కూతురుకి మీలాంటి లక్షణాలున్న వ్యక్తి భర్తగా వస్తే అంగీకరిస్తారా? అలాగే స్త్రీలూ మీ అబ్బాయికి మీలాంటి వ్యక్తి భార్యగా వస్తే అంగీకరిస్తారా? అంగీకరించలేకుంటే అలా మిమ్మల్ని మార్చుకుంటే బంధాలు నిలబడతాయి. యువత ఆత్మపరిశీలన చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని సూచిస్తున్నారు.

Similar News

News February 16, 2026

గర్భిణీలకు టిఫా స్కాన్ ఎందుకు?

image

టిఫా అంటే ‘టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫ్యూటల్‌ ఎనామిలీస్‌’. గర్భిణులకు 18-22 వారాల మధ్య ఈ స్కాన్‌ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని పరిశీలిస్తారు. శిశువు, మాయ పొజిషన్, ఉమ్మనీరు ఎంత ఉంది అన్నవి ఇందులో గుర్తిస్తారు. ఈ స్కాన్ ద్వారా చిన్నారుల్లో ఏమైనా లోపాలు ఉంటే ముందే గుర్తించి అందుకు తగిన వైద్యం అందించి తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

News February 16, 2026

సంగారెడ్డి: ‘రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటాలి’

image

రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటాలని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి కార్యాలయంలో స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని పోలీసులకు టీ షర్ట్‌లను మంగళవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.

News February 16, 2026

SETSలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీ (SETS) 4 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech (CS, IT, IS, సైబర్ సెక్యూరిటీ, ECE), ME/MTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు FEB 19 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.40,000-రూ.60,000 వరకు చెల్లిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://setsindia.in