News November 20, 2025

HYD: మీసం తిప్పే వయసులో.. మత్తుకు చిత్తు

image

మీసం తిప్పే వయసులో యువత మత్తుకు చిత్తవుతున్నారు. ఇదే ఆసరాగా యువతకు డబ్బు ఆశ చూపి, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అనేక డ్రగ్స్ కేసుల్లో యువకులు రవాణాదారులుగా ఉండటం కలవరపెడుతోంది. HYDలో గత ఆరేళ్లలో సుమారు 1,000 మందికిపైగా 12- 18 ఏళ్లవారే కేసుల్లో చిక్కకున్నట్లు తెలుస్తోంది. యుక్త వయసులో నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సోషల్ మీడియా వీడియోల ప్రభావం సైతం ఉందని తేలింది.

Similar News

News November 20, 2025

పోలీసులకు సవాల్‌గా సీపీఎం నేత హత్య కేసు

image

పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఎం నేత సామినేని రామారావు హత్యకేసు పోలీసులకు సవాల్‌గా మారింది. 20 రోజుల క్రితం జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకుని, ఆరు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. హత్యను కిరాయి హంతకులు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నప్పటికీ, ఆధారాలు లభించడం లేదు. అనుమానితులను విచారించినా దోషులు దొరకకపోవడంతో, సీపీఎం ఈ నెల 25 నుంచి దశలవారీగా ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది.

News November 20, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గి రూ.1,24,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,14,300 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 20, 2025

గ్రేటర్ వైపు.. గులాబీ దళం చూపు

image

జూబ్లీహిల్స్ ఎన్నిక ముగిశాక BRS నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదు. నాయకులు, కార్యకర్తలకు KTR బుధవారం దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి సత్తా తమ ఏంటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపఎన్నిక ఓటమి తర్వాత KTR కార్యకర్తల్లో ఉత్సాహం నింపే యత్నం చేస్తున్నారు. గతంలో గ్రేటర్ పీఠం BRSకు దక్కింది.. ఇప్పుడూ మనమే దక్కించుకుందామని పేర్కొన్నారు. GHMCలో ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి.