News August 18, 2025
HYD: మీ పేరుపై ఎన్ని సిమ్ములు ఉన్నాయో.? ఇలా తెలుసుకోండి.!

మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయి.? ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారేమో.? అని ఆందోళన చెందుతున్నారా..? దయచేసి సంచార్ సాథీ పోర్టల్ www.sancharsaathi.gov.inలో మీ పేరు మీద జారీ చేయబడిన SIMS తనిఖీ చేసుకోవాలని సమాచార కేంద్ర శాఖ ప్రజలందరికీ పంపుతున్నట్లు HYD పోలీసు అధికారులు తెలిపారు. మీ సిమ్ వేరే వ్యక్తులు ఉపయోగిస్తే, అది మీపైకి వచ్చే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
Similar News
News August 18, 2025
SKLM: అధికారులతో సమీక్షించిన కలెక్టర్

జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుండ్కర్ సోమవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు, భవనాళ శాఖ, పంచాయతీరాజ్, ఫైర్ విద్యుత్ శాఖ అధికారులతో చర్చించారు. అల్పపీడనం కొనసాగుతున్నందున ఎక్కడ నిర్లక్ష్యం వహించరాదని తెలియజేశారు.
News August 18, 2025
వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: నిర్మల్ అడిషనల్ కలెక్టర్

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. సోమవారం మామడ మండలం పరిమండల్ గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి రాజేందర్, ఎంపీడీవో సుశీల్ రెడ్డి, డాక్టర్ మౌనిక పాల్గొన్నారు.
News August 18, 2025
గడ్డేన్న ప్రాజెక్టుకు సందర్శకులు రావొద్దు: సీఐ

గడ్డేన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం వల్ల సందర్శకులు ఎవరూ అటువైపు రావద్దని సీఐ గోపీనాథ్ హెచ్చరించారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున, ప్రాజెక్టు దిగువన వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుందని ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రాజెక్టు వద్ద తాళ్లు కట్టామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.