News November 16, 2025
HYD: మీ ఫోన్ పోయిందా? ఇలా చేయండి!

మీ మొబైల్ పోయిందా? అశ్రద్ధ చేయకండి. వెంటనే CEIR పోర్టల్ ద్వారా మీ మొబైల్ వివరాలు నమోదు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్లో అందించండి. పోలీసులు మీ మొబైల్ వెతికి మీకు అందిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి 2025 అక్టోబర్ 16 వరకు పోలీసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 84,003 ఫోన్లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గుర్తించినవి 45,261 కాగా.. అందజేసినవి 14,965 ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
ఫేస్ క్రీమ్ వాడుతున్నారా?

కొన్ని క్రీములను కలిపి రాయడం వల్ల అదనపు ప్రయోజనాలుంటాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..ముడతలు ఎక్కువగా ఉన్నవారు విటమిన్-సి ఉన్న క్రీములతో పాటు సన్‌స్క్రీన్ లోషన్ కలిపి రాయాలి. చర్మం మృదువుగా ఉండాలంటే రెటినాల్, పెప్టైడ్ క్రీములు ఎంచుకోండి. అయితే రెటినాల్‌ను రాత్రే రాయాలి. హైలురోనిక్ యాసిడ్‌తోపాటు ఏహెచ్ఎ, బీహెచ్ఎ ఉన్నవి ఎంచుకోండి. ఈ సమస్యలన్నీ తగ్గిపోయి చర్మం తాజాగా కనిపిస్తుంది.
News November 16, 2025
మిర్యాలగూడకు మంత్రులు..ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా

మిర్యాలగూడలో సోమవారం జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి విచ్చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శెట్టిపాలెం నుంచి అవంతిపురం వరకు నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన వంటి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటారు.
News November 16, 2025
నా వర్క్‌కు పర్సనల్ నంబర్ వాడను: అదితీరావు

హీరోయిన్ అదితీరావు హైదరీ ఫొటోలను ఉపయోగిస్తూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇన్‌స్టాలో ఓ నోట్ రిలీజ్ చేశారు. ‘ఫొటోషూట్‌ల పేరుతో ఫొటోగ్రాఫర్లకు దుండగులు వాట్సాప్‌లో నా ఫొటో పెట్టుకొని సంప్రదిస్తున్నారు. నేనెప్పుడూ నా వర్క్‌కు పర్సనల్ నంబర్‌ను వాడను. ఏదైనా నా టీమ్ చూసుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి’ అని పేర్కొన్నారు.


