News November 18, 2025

HYD: మీ బండిలో ఇంజిన్ ఆయిల్ పోయిస్తున్నారా?

image

HYDలో నకిలీ ఇంజిన్ ఆయిల్ దందా రోజురోజుకూ పెరుగుతోంది. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కొందరి బండి ఇంజిన్ త్వరగా వేడెక్కుతోందని, పొగవస్తోందని ఆరా తీయగా గుట్టు బయటపడింది. ఈ ఆయిల్‌తో బండి త్వరగా బోర్‌కు వస్తుందని, క్లచ్‌లో తేడా గమనిస్తే మెకానిక్‌ను సంప్రదించాలని నిపుణుల చెబుతున్నారు. నమ్మకమైన చోట బండి సర్విసింగ్‌కు ఇవ్వాలని, ఆయిల్ కొనాలని సూచించారు. తేడావస్తే ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News November 18, 2025

మీ భాగస్వామి ఇలా ఉన్నారా?

image

మానసిక సమస్యలున్న వారు బయటకు సాధారణంగానే కనిపిస్తుంటారు. వీరిలో కొందరు భాగస్వామిని మానసికంగా వేధిస్తుంటారంటున్నారు నిపుణులు. తమను తామే గొప్పగా ఊహించుకుంటూ.. నేనే కరెక్ట్, నాకే చాలా విషయాలు తెలుసు అన్న భావనలో ఉంటారు. భాగస్వామి నిర్ణయాలను కూడా వీరే తీసుకుంటారు. భాగస్వామికి తనపై ఆసక్తి తగ్గిందని భావిస్తే తనకంటే మంచోళ్లు ఇంకొకరు లేరన్న భావనను వారి మనసుల్లో సృష్టించి వారిపై పట్టు తెచ్చుకోవాలనుకుంటారు.

వరంగల్: ‘స్థానిక పోరు’పై మళ్లీ మొదలైన ఆసక్తి

image

స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గ్రామాల్లో మళ్లీ ఎన్నిక కోలాహలం అంతర్గతంగా మొదలైంది. వరంగల్ జిల్లాలో ఆశావహులు ఎన్నికల్లో పోటీపై మరోసారి చర్చలు ప్రారంభించారు. రిజర్వేషన్లు మారనున్న నేపథ్యంలో పోటీ చేయాలా..? వద్దా..? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఎన్నికల హడావుడి తిరిగి మొదలైంది. వరంగల్ జిల్లాలో 317 పంచాయతీలు, 130 MPTC, 11 ZPTC స్థానాలున్నాయి.