News January 3, 2025
HYD: ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి కొండా సురేఖ
HYD జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంగ్ల నూతన సంవత్సరం-2025 సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. దేవాదాయ శాఖ అంశాలతో పాటు వరంగల్ ఎయిర్‌పోర్ట్, వరంగల్ నగర అభివృద్ధి గురించి చర్చించినట్టు సమాచారం.
Similar News
News January 5, 2025
హైదరాబాద్ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా
HYD జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. వెస్ట్ మారేడ్‌పల్లిలో 13℃, సులేమాన్‌నగర్ 13.7, షేక్‌పేట 13.8, ముషీరాబాద్ 14.2, కంటోన్మెంట్ 14.4, గోల్కొండ 14.6, లంగర్‌హౌస్ 14.6, ఆసిఫ్‌నగర్ 14.8, చాంద్రయాణగుట్ట 14.9, మోండామార్కెట్ 15.1, రియాసత్‌నగర్ 15.1, విజయనగర్‌కాలనీ 15.2, అహ్మద్‌నగర్ 15.7, గౌలివాడ 15.8, తిరుమలగిరి 15.9, జూబ్లీహిల్స్ 15.9, మెహదీపట్నం 16.2, పాటిగడ్డలో16.2℃గా నమోదైంది.
News January 5, 2025
సైబరాబాద్‌ను సురక్షితంగా మార్చాలి: CP
ప్రజా సమస్యలను సమర్థంగా పరిష్కరించేలా ప్రమాణాలు రూపొందించాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ప్రజలు సురక్షితంగా నివసించే ప్రాంతంగా సైబరాబాద్‌ను మార్చాలన్నారు.
News January 5, 2025
HYD: రైతుద్రోహి సీఎం: కేటీఆర్
మాజీమంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై Xలో మండిపడ్డారు. అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా, రైతు భరోసాలో ప్రభుత్వం రైతునే కాంగ్రెస్ మాయం చేసిందన్నారు. మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్.. మోసానికి మారు పేరని పేర్కొన్నారు. ఢోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్ అని రైతుద్రోహి సీఎం రేవంత్ అని రాసుకొచ్చారు.