News October 22, 2024
HYD: ముత్యాలమ్మ గుడి వద్ద ఆందోళన.. కేసు నమోదు

సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఆందోళనకు కారణమైన వ్యక్తులపై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక భర్త నరేశ్‌ను మొదటి ముద్దాయిగా, ప్రశాంత్‌ను A2గా, కిరణ్ RSS A3గా, కంటోన్మెంట్ BJP MLA అభ్యర్థిగా పోటీ చేసిన వంశతిలక్ A4తో పాటు శరత్ ఠాగూర్, రాంరెడ్డి, కిషన్, శివరాంపై కేసు నమోదైంది.
Similar News
News July 7, 2025
టేస్టీ ఫుడ్: వరల్డ్‌లో హైదరాబాద్‌కు 50వ స్థానం

రుచికరమైన వంటకాల్లో బెస్ట్ సిటీ మన హైదరాబాద్ అని మరోసారి నిరూపితమైంది. టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్ ఫుడ్ లభించే నగరాల్లో HYDకు 50వ స్థానం దక్కింది. HYD బిర్యానీ, హలీమ్, ఇరానీ ఛాయ్, తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ, మొఘల్, టర్కిష్ రుచులు సిటీలో ఏ మూలకు వెళ్లిన లభిస్తాయి. అందరికీ అందుబాటులోనే ధరలు ఉండటం విశేషం. మరి సిటీలో మీ ఫేవరెట్ ఫుడ్ ఏది? కామెంట్ చేయండి.
News July 7, 2025
HYD: యుక్త వయసులో మెదడుపై ప్రభావం!

యుక్త వయసులోనే యువత మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. ఓ వైపు డ్రగ్స్, మద్యం మత్తు, మరోవైపు సైబర్ మోసం, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకోవడంతో ఒక్కోసారి జీవితంపై విరక్తి చెంది మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో తల తిరగడం, ఒళ్లు వణికే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి లక్షణాలు కలిగిన 18 మందికి పైగా ఈ నెలలో ఎర్రగడ్డ, ఉస్మానియా వైద్యులను సంప్రదించడం ఆందోళనకరం.
News July 6, 2025
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్.. 105 మందిపై చర్యలు

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ పరిధిలో పట్టుబడ్డ 105 మందిని నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణలో రూ.2.39 లక్షల జరిమానా విధించబడింది. కొందరికి జైలు శిక్షలు కూడా విధించారు. ఈ చర్యలు ప్రజల్లో ట్రాఫిక్ అవగాహన పెంపొందించేందుకు చేపట్టినవని సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ACP మోహన్ కుమార్ తెలిపారు.