News October 7, 2024

HYD: ముసాయిదాపై అభిప్రాయ సేకరణ: మంత్రి

image

రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి HYDలో అన్ని జిల్లాల కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్త ROR చట్టం, 2024 ముసాయిదాపై అధికారుల నుంచి మంత్రి అభిప్రాయాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

Similar News

News January 3, 2025

HYDలో పెళ్లి ఖర్చుకు వెనకాడట్లే..!

image

హైదరాబాద్‌లో రోజురోజుకు పెళ్లిళ్ల ఖర్చు అమాంతం పెరుగుతోంది. ఓ సర్వే ప్రకారం వివాహ ఖర్చు నగరంలో రూ.30 లక్షల నుంచి రూ.కోటికి పైగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏడాదికి దాదాపు 30% పెరుగుతోందని కాన్ఫరెన్స్ ట్రేడర్స్ సర్వే తెలిపింది. పెళ్లి ఖర్చుకు సంపన్నులు సహా, మధ్యతరగతి వారు సైతం వెనకాడటం లేదని పేర్కొంది.

News January 3, 2025

HYD: నిర్ణయం మార్చుకోకుంటే ఉద్యమమే: ఎంపీ లక్ష్మణ్

image

HYD రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ అలైన్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా మార్చాలని BJP నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం టెండర్లు పిలవడం శుభపరిణామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం RRR నార్త్ అలైన్‌మెంట్ మార్పు చేయాలని, లేదంటే బాధితుల పక్షాన ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.

News January 3, 2025

HYD: సీఎం రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్

image

నేడు సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉండనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటిగ్రేటేడ్​ కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో హైదరాబాద్​ జల మండలి బోర్డు మీటింగ్‌కి హాజరవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సెక్రెటేరియట్​లో రీజనల్​ రింగ్​ రోడ్డు, ఆర్​ అండ్​ బీ, నేషనల్​ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం సమీక్ష ఉండనుంది.