News January 28, 2025
HYD: ముసుగు దొంగలు.. జర జాగ్రత్త..!

గ్రేటర్ HYDలో ముసుగు దొంగలు హల్‌చల్ సృష్టిస్తున్నారు. ఘట్‌కేసర్ PS పరిధి అంకుషాపూర్‌లో వారం రోజులుగా రాత్రిపూట ముసుగు ధరించి ఓ ముఠా గల్లీల్లో తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముసుగులు వేసుకుని దొంగలు సంచరిస్తుండడంతో రాత్రివేళలో బయట తిరగాలంటే భయపడుతున్నామని వాపోతున్నారు. గ్రేటర్ HYDలో రాత్రిళ్లు పెట్రోలింగ్ పెంచాలని HYD, సైబరాబాద్, రాచకొండ పోలీసులను ప్రజలు కోరుతున్నారు.
Similar News
News October 28, 2025
భారీ వర్షాలు.. కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కోళ్లకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే కోళ్ల ఫారాన్ని శుభ్రంగా ఉంచాలి. ఫారం నుంచి నీరు బయటకు పోయేలా డ్రైనేజ్ సక్రమంగా ఉండేట్లు చూసుకోవాలి. కోళ్లకు నీరందించే నీటి బుట్టలు లీక్ కాకుండా సరి చూడాలి. లిట్టర్ బాగా తడిగా ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి. ఫారంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. కోళ్లలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెటర్నరీ డాక్టరును సంప్రదించాలి.
News October 28, 2025
మధిర: NPDCLకు 2 ప్రతిష్ఠాత్మక ISO సర్టిఫికేట్లు ప్రదానం

NPDCLకు 2 ప్రతిష్ఠాత్మక ISO సర్టిఫికేట్లు లభించాయి. మధిరలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సర్టిఫికేట్లను సీఎండీకి అందజేశారు. నాణ్యమైన పంపిణీకి ISO 9001:2015, ఉద్యోగుల భద్రతా ప్రమాణాల అమలుకు ISO 45001:2018 సర్టిఫికేట్లు లభించాయని తెలిపారు. వీటిని హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సంస్థ జారీ చేసింది.
News October 28, 2025
తుఫాన్లలోనూ ఆగని విద్యుత్.. భూగర్భ కేబుల్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

మధిర పట్టణంలో విద్యుత్ రంగాన్ని ఆధునీకరించేందుకు రూ.27.76 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో కూడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయడమే లక్ష్యమన్నారు. మొత్తం 3.5 కి.మీ 33 కేవీ, 17.3 కి.మీ 11 కేవీ, 15 కి.మీ ఎల్‌టీ లైన్లను భూగర్భంలో వేయనున్నట్లు తెలిపారు.


