News March 21, 2025
HYD: మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు నీటితొట్లు

మూగజీవాల పట్ల దయ కలిగి ఉండాలని ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుమూల రజిత పరమేశ్వర్ రెడ్డి అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మూగజీవాల దాహార్తిని తీర్చేందుకై జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నీటి తొట్లను ఆమె ఇవాళ పరిశీలించారు. డిప్యూటీ వెటర్నరీ డైరెక్టర్ డాక్టర్ రంజిత్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
Similar News
News March 28, 2025
కళకళలాడుతోన్న చార్మినార్

అర్ధరాత్రి చార్మినార్ కళకళలాడుతోంది. రంజాన్ మాసంలో నేడు చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల(అల్ విధా జుమ్మా) కోసం ఏర్పాట్లు చేశారు. పండుగకు మరో రెండ్రోజులే సమయం ఉండటంతో జనాలు షాపింగ్ కోసం క్యూకట్టారు. కమాన్ రోడ్, భాగ్యలక్ష్మీ టెంపుల్ రోడ్, లాడ్ బజార్, న్యూ లాడ్ బజార్, రాత్‌ఖానా గల్లీ, మోతీ గల్లీలు కిక్కిరిసిపోయాయి. వాహనాలు పార్కింగ్‌కు స్థలం దొరకని పరిస్థితి నెలకొంది.
News March 27, 2025
ఉప్పల్‌లో SRH, మహేశ్ బాబు FANS

ఉప్పల్ స్టేడియం వద్ద SRH, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన పలువురు యువత ఆరెంజ్ ఆర్మీ టీషర్ట్స్, మహేశ్ బాబు బ్యానర్‌తో స్టేడియానికి చేరుకున్నారు. ఈ సారి SRH బ్యాటింగ్‌కు దిగితే 300 స్కోర్ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
News March 27, 2025
IPL మ్యాచ్ చూడడానికి ఇవి తీసుకెళ్లకండి..!

వాటర్ బాటిల్స్ కెమెరాస్ IPL క్రికెట్ మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వెళ్లే ప్రేక్షకుల కోసం రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. మ్యాచ్ చూడడానికి వెళ్లే వారు ఎలాంటి వస్తువులను తీసుకెళ్లద్దని తెలిపారు. స్టేడియం వద్ద వస్తువులు నిలువ చేసుకోవడానికి CLOAKROOM ఉండవని తెలిపారు. ఏ వస్తువులు తీసుకెళ్లకూడదో ఒక జాబితా విడుదల చేశారు. కెమెరా, సిగరెట్స్, స్నాక్స్, బ్యాగ్స్, పెట్స్ తదితరాలపై నిషేదం ఉంటుంది.