News April 25, 2025
HYD: మూసీ ప్రాజెక్ట్.. భూ పరీక్షలకు బిడ్లు ఆహ్వానం

మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూసీ ప్రాజెక్టు అభివృద్ధిపై చక చకా అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే మీర్‌అలం ట్యాంకు వద్ద భూ పరీక్షలు నిర్వహించేందుకు బిడ్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. మూసీకి ఆనుకుని ఉన్న భూమి పరిస్థితి, భూబలం, ఇతర సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఈ పరీక్షలు తోడ్పడనున్నాయి.
Similar News
News February 21, 2026
VKB: దారుణం.. కొడుకుని చంపి తల్లి సూసైడ్

వికారాబాద్ జిల్లాలో హృదయ విదారకర ఘటన కలకలం రేపుతోంది. ఇందిరమ్మ కాలనీలో కొడుకుకు ఉరివేసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిందని యాలాలు ఎస్సై విట్టల్ రెడ్డి తెలిపారు. తాండూర్‌లోని ఇందిరమ్మ కాలనీలో బ్లాక్ నం.28లో బుడగ జంగం గౌరమ్మ (30)తన 4ఏళ్ల కుమారుడు రవికాంత్‌తో జీవనం సాగిస్తోంది. సమస్యలతో సతమతమవుతున్న గౌరమ్మ శుక్రవారం ఉదయం కుమారుడికి ఉరివేసి తర్వాత గౌరమ్మ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు.
News February 21, 2026
NRPT: పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: కలెక్టర్

నారాయణపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షల సన్నద్ధతపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల హెచ్‌ఎంలతో సమావేశమైన ఆమె.. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అన్ని మండలాల్లో విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించాలని, జిల్లాలో శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
News February 21, 2026
17 లక్షల యాప్స్‌పై బ్యాన్!

ఆండ్రాయిడ్ యూజర్ల భద్రత కోసం ప్లేస్టోర్ క్లీనింగ్ చర్యలను గూగుల్ చేపట్టింది. ఫేక్, పాలసీలను ఉల్లంఘిస్తున్న 17.5 లక్షల యాప్స్‌ను బ్యాన్ చేసింది. హానికరమైన, ఫేక్ యాప్స్‌కు చెందిన 80 వేల డెవలపర్ అకౌంట్లను బ్లాక్ చేసింది. మరోవైపు 16 కోట్ల స్పామ్ రేటింగ్స్, ఫేక్ ఫీడ్ బ్యాక్స్‌ను డిలీట్ చేసింది. 2.55 లక్షల యాప్స్ అనవసరంగా లొకేషన్, ఫొటోలు, ఇతర వ్యక్తిగత సమాచారం అడగకుండా నిరోధించినట్లు కంపెనీ తెలిపింది.


