News January 25, 2025
HYD: మూసీ ప్రాజెక్ట్, మురుగు శుద్ధీకరణపై UPDATE

మూసీ ప్రాజెక్ట్, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మురుగు శుద్ధీకరణపై ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. HYDలో 55KM మూసీ నది పొడవునా ఇరువైపులా మొత్తంగా 110 కిలోమీటర్లలో కాలువలు, బాక్స్ డ్రైన్ నిర్మాణాలు, STP నిర్మాణాలకు రూ.10,000 కోట్లు.. HYD సమీప 27 పట్టణ, నగర పాలక సంస్థల పరిధిలో డ్రైనేజీ నెట్ వర్క్ నిర్మాణానికి రూ.17,212 కోట్లతో సమగ్ర మురుగునీటి మేజర్ ప్లాన్ (CSMP)కు నిధులివ్వాలని కేంద్రాన్ని కోరింది.
Similar News
News September 17, 2025
MIMకు భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారు: కిషన్ రెడ్డి

TG: మజ్లిస్ పార్టీకి వత్తాసు పలికేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం చరిత్రను వక్రీకరించి విమోచన దినోత్సవానికి అనేక పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీకి భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారని ఫైరయ్యారు. మూడేళ్ల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఘనంగా విమోచన వేడుకలు నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
News September 17, 2025
విశాఖలో హెల్త్ క్యాంప్‌ను సందర్శించిన సీఎం

CM చంద్రబాబు విశాఖలో నిర్వహించిన ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ <<17736648>>హెల్త్ క్యాంప్<<>>ను సందర్శించారు. గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లకు మహిళలు ముందుకు రావడం లేదని, వారికి అవగాహన కల్పించి విలేజ్ క్లీనిక్ సెంటర్‌లో టెస్ట్‌లు చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి సత్యకుమార్ CMకి వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను పరిశీలించిన CM ఓ చంటి బిడ్డకు డ్రాప్స్ వేశారు.
News September 17, 2025
కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు

విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా విశ్వకర్మ జయంతి వేడుకలు జరిగాయని కలెక్టర్ తెలిపారు.