News February 11, 2025
HYD: మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739269559153_51984374-normal-WIFI.webp)
మధ్యప్రదేశ్ జబల్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశామన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News February 12, 2025
17వ తేదీ నుంచి ఓయూ సెల్ట్ తరగతులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739265604659_52136336-normal-WIFI.webp)
ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో ఈ నెల 17వ తేదీ నుంచి తరగతులను నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సవిన్ సౌడ తెలిపారు. రెండు నెలల ఈ కోర్సుకు ప్రతిరోజూ ఉదయం ఆరున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న వారు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 79899 03001, 98497 52655 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
News February 12, 2025
గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ శ్రవణ్ మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739293539915_718-normal-WIFI.webp)
ఈనెల 9న సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లోని కామాక్షి సిల్క్స్ క్లాత్ షోరూమ్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన శ్రవణ్ కుమార్(37) మంగళవారం తెల్లవారుజామున గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతిచెందాడు. శ్రవణ్ 98 శాతం కాలిన గాయాలతో ఆదివారం గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మార్కెట్ పీఎస్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు.
News February 11, 2025
హైదరాబాద్‌లో రూ.20 లక్షల విలువైన విదేశీ సిగరేట్స్ సీజ్..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739279527236_52296546-normal-WIFI.webp)
హైదరాబాద్‌లో విదేశీ సిగరెట్ల గుట్టును కమిషనర్ టాస్క్‌ఫోర్స్, సౌత్ వెస్ట్ జోన్, హాబీబ్ నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో రట్టు చేశారు. రూ.20 లక్షల విలువైన విదేశీ సిగరేట్స్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అఫ్సల్ నగర్, అగపురా రోడ్డులో ఓ గోదాంలో విదేశీ సిగరేట్స్ నిల్వ ఉంచారు. ఈ మేరకు నిందితులు ఇమ్రాన్, ఆయుబ్‌ను అరెస్ట్ చేశారు.