News September 11, 2024

HYD: మెట్రో ప్రయాణికుల కొత్త డిమాండ్

image

హైదరాబాద్‌ మెట్రో‌లో రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా నాగోల్ నుంచి రాయదుర్గం రూట్‌లో ఉదయం, సాయంత్రం నిలబడలేని పరిస్థితి ఉంటోంది. నాన్‌స్టాప్ సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనివలన ప్రయాణం సౌలభ్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రెగ్యులర్ సేవలతో పాటు నాన్ స్టాప్ సర్వీసులు కూడా ఏర్పాటు చేయడంతో‌ సమయం ఆదా అవుతోందన్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News February 28, 2026

HYD: నమ్మండి.. ఇది రోడ్డే..!

image

ప్రతాపసింగారం-ఉప్పల్ రహదారి ముత్వెల్లిగూడలో నరకకూపంగా మారింది. R&B, మున్సిపల్, HMWSSB అధికారుల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమైంది. మోకాలి లోతు గుంతలు ఏర్పడినా యంత్రాంగం కళ్లుమూసుకుంది. 15 రోజులుగా కృష్ణా నీటి పైప్‌లైన్ లీక్ అవుతున్నా జలమండలి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు స్థానికులు మండిపడుతున్నారు. ఇరు అధికారుల బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ఠగా మారి ప్రజలకు శాపమైంది.

News February 28, 2026

మెట్రో రైల్ రికార్డు.. 80 కోట్ల ప్రయాణాలు పూర్తి

image

హైదరాబాద్ మెట్రో రైలు మరో మైలు రాయిని చేరుకుంది. నగరవాసులకు గమ్యాన్ని సుగమం చేసిన మెట్రో రైలు ప్రారంభం నుంచి ఇప్పటివరకు 80 కోట్ల ప్రయాణాలు పూర్తి చేసింది. 2017 నవంబర్‌లో ప్రారంభమైన ఈ సేవలు రోజు రోజుకీ నగర ప్రజల ఆదరణ పొందుతుంది. ప్రతిరోజూ 4.1 నుంచి 4.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ప్రతి నెలా 1.2 కోట్లకు పైగా ప్రయాణికులు మెట్రోను వినియోగిస్తున్నారు.

News February 28, 2026

HYD: రేపటి నుంచి కష్టమే.. జర పైలం!

image

మార్చిలో ప్రారంభమయ్యే ఎండలు నగరంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. దీంతో నీటి అవసరాల సైతం పెరుగుతాయని వివరించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వీలుంటే గొడుగు తీసుకుని వెళ్లటం మంచిదని సూచించారు. HYDలో వడగాలులు సైతం వీచే అవకాశం ఉందన్నారు. కొత్తగా ఇళ్లు కట్టుకునేవారు కచ్చితంగా ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకోవాలని తెలిపారు.