News April 11, 2026
HYD మెట్రో ఫేజ్ -2కు లైన్ క్లియర్

MGBS-దారుల్షిఫా నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో అలైన్‌మెంట్‌కు అడ్డంగా ఉన్న 84 భారీ చెట్లను మరో చోటికి ట్రాన్స్ లొకేట్ చేసేందుకు HAML టెండర్లు పిలిచింది. రూ 15.64 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులను మూడు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు పాతబస్తీ మెట్రో అలైన్‌మెంట్‌లో కీలక అడ్డంకులను తొలగించి, పనులు వేగవంతం చేయడానికి ఉపయోగపడనుంది.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.