News February 26, 2026

HYD: మెట్రో ఫేజ్-2 అలైన్‌మెంట్ వెనుక ‘రియల్’ రాజకీయం?

image

మెట్రో ఫేజ్-2 విస్తరణ ఇప్పుడు ‘రియల్’ పాలిటిక్స్‌కు కేంద్రంగా మారింది. రాయదుర్గం ఎయిర్‌పోర్ట్ లైన్‌ను కాదని, నాగోల్-ఎల్బీనగర్ వైపు మళ్లించడం వెనుక వేల ఎకరాల భూసమీకరణపై చర్చలు జోరందుకున్నాయి. పాతబస్తీలో నిర్మాణ వ్యయం 25% పెరగడం ప్రభుత్వానికి భారం కానుంది. మరోవైపు కేంద్రం నిధులపై కొర్రీలు వేయడం, L&T బాధ్యతల మార్పులో న్యాయపరమైన చిక్కులు ప్రాజెక్టును ఉత్కంఠలో పడేశాయి.

Similar News

News February 27, 2026

నిజం దాగదు.. RRRపై ఐపీఎస్ సంచలన పోస్ట్

image

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ‘ఎక్స్’ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. “సాధారణంగా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి.. మరి కస్టడీలో అంత దారుణంగా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?” అని ప్రశ్నించారు. అబద్ధాలు బయటపడుతున్నాయని, నిజం ఎప్పటికీ దాగదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

News February 27, 2026

మండలిలో గందరగోళం.. వాయిదా

image

AP: శాసనమండలిలో గందరగోళం నెలకొంది. తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ఛైర్మన్ పోడియాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ తీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గందరగోళం మధ్య ఛైర్మన్ సభను వాయిదా వేశారు.

News February 27, 2026

వరంగల్‌: టమాటా మిర్చి క్వింటా రూ.50 వేలు

image

వరంగల్ ఎనుమామూల వ్యవసాయ మార్కెట్లో టమాటా మిర్చి బంగారం, వెండి ధరలతో పోటీపడి పెరుగుతున్నాయి. శుక్రవారం క్వింటా టమాటా మిర్చి రూ.50,000 ధర పలికింది. ఈ నెల 18న క్వింటాలు కు రూ.35,000 ధర రాగా, 19న రూ.36,000, 23న రూ.37,000, 25, 26న రూ.40,000 ధర పలకగా, శుక్రవారం ఒక రోజే క్వింటాకు రూ.10,000 పెరిగి, రూ.50,000 అత్యధిక ధర పలికింది. 10 రోజుల్లో క్వింటా రూ.10,000 ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.