News April 9, 2025
HYD: మెట్రో రైల్ ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి

మెట్రో రైల్ ఎండీగా NVS రెడ్డికి ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించింది. కీలకమైన రెండో దశ ప్రాజెక్టులో ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక విషయాలపై ఆయనకు అవగాహన ఉందని, అందుకే ఆయన్ని ఆ పదవిలో కొనసాగించినట్లు సమాచారం. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.
Similar News
News December 10, 2025
భిక్కనూర్: డబ్బులు, మందు కోసం మా ఇంటికి రావద్దు

భిక్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచి స్థానానికి ఎన్ఆర్ఐ మైత్రేయి పోటీ చేస్తున్నారు. డబ్బులు, మద్యం కోసం మా ఇంటికి రావద్దని బుధవారం ఆమె ఇంటి ఎదుట బోర్డు ఏర్పాటు చేశారు. నిజాయతీగా ఓటు వేయాలని బోర్డుపై రాసి ఉంచారు. డబ్బులు, మద్యం కోసం కొందరు ఓటర్లు ఇంటికి వస్తుండటంతో ఇలా బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
News December 10, 2025
పార్వతీపురం: ‘ప్రకృతి వ్యవసాయంతో నిరంతర ఆదాయం’

ప్రకృతి వ్యవసాయ విధానాలు, బహుళ పంటల సాగు ద్వారా రైతులు నిరంతర ఆదాయం పొందాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ప్రకృతి వ్యవసాయ క్షేత్ర సందర్శనలో భాగంగా బందలుప్పి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని కర్రి మురళి అనే రైతు పొలాన్ని సందర్శించి, అక్కడ సాగు చేస్తున్న వివిధ రకాల పంటల నమూనాలను, ఏ గ్రేడ్ మోడల్స్‌ను పరిశీలించారు.
News December 10, 2025
కుందేళ్ల పెరుగుదలకు మేలైన ఆహారం

పుట్టిన 12 రోజుల తర్వాత నుంచి కుందేలు పిల్లలు ఆహారం తింటాయి. కుందేళ్లకు గడ్డితో పాటు దాణాలో మొక్కజొన్న, జొన్న, వేరుశనగ చెక్క, తవుడు, లవణ మిశ్రమాలు తగిన పరిమాణంలో కలిపి మేతగా అందించాలి. లూసర్న్, బెర్సీమ్, నేపియర్, పారాగడ్డి, వేరుశనగ, చిక్కుడు, సోయా, పిల్లిపెసర ఆకులను మేతలో కలిపి ఇవ్వవచ్చు. కుందేళ్లకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. నీటిని అందుబాటులో ఉంచాలి.


