News December 13, 2025

HYD: మెస్సీ మ్యాచ్.. నేడు ట్రాఫిక్ ఆంక్షలు!

image

మెస్సీ మ్యాచ్‌ సందర్భంగా సిటీలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. WGL వైపు నుంచి ఉప్పల్ మీదుగా HYD, సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఘట్‌కేసర్‌ ORR మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్, LBనగర్, దిల్‌సుఖ్‌నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే HYD నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వెళ్లాలనుకునే వారు ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ORR మీదుగా వరంగల్ వెళ్లాల్సిందిగా ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
SHARE IT

Similar News

News December 14, 2025

TTD నిధులతో SV జూ అభివృద్ధి

image

తిరుపతిలోని SV జూలాజికల్ పార్క్ అభివృద్ధికి టీటీడీ నుంచి రూ.97 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జంతువుల భద్రత, సందర్శకుల సౌకర్యాల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. బోర్డు తీర్మానం 474కి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

News December 14, 2025

క్రమశిక్షణ గల పౌరులను అందించే పరిశ్రమ ఏయూ: గంటా

image

ఆంధ్రా యూనివర్సిటీ నైతిక విలువలు, క్రమశిక్షణ గల భావి పౌరులను తయారు చేసే పరిశ్రమ అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏయూ అనేక మంది నాయకులు, క్రీడాకారులు, ప్రతిభావంతులను దేశానికి అందించిందన్నారు. విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకుని కృషి చేయాలని సూచించారు. శతాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో నిర్వహించాలని కోరారు.

News December 13, 2025

KMR: 16 ప్రదేశాల్లో ఆరెంజ్, 16 ఎల్లో అలర్ట్

image

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత స్థిరంగా ఉంది. జిల్లాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఆధారంగా 16 ప్రదేశాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 10°Cలోపు ఉష్ణోగ్రతలు నమోదు కాగా మిగతా 16 ప్రదేశాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. 15°C లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలోని అన్ని ప్రదేశాలు చలి గుప్పిట్లో బందిలయ్యి ఉన్నాయి. ప్రజలు తమ పనులకు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.