News September 3, 2025

HYD: మేడారం మహా జాతర ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్‌పై మంత్రుల సమీక్ష

image

సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనలతో మేడారం దేవాలయ ప్రాంగణం నూతన డిజైన్‌ను మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఈరోజు HYDలో పరిశీలించారు. డిజైన్‌లో అవసరమైన మార్పులపై చర్చించి, తగిన సూచనలు చేశారు. మేడారం నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేయాలని, మహా జాతర ప్రారంభానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని, పూజారుల అభిప్రాయం మేరకు ఆధునీకరణ పనులు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.

Similar News

News September 3, 2025

‘HYD యూత్ డిక్లరేషన్ అమలు ఎక్కడ..?’

image

HYD యూత్ డిక్లరేషన్ అమలు కావడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. యూత్ డిక్లరేషన్ ప్రకారంగా నిరుద్యోగ భృతి రూ.4,000, ప్రతి ఏడాది జూన్ 2న జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సెప్టెంబర్ 17 నాటికి రిక్రూట్‌మెంట్ పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, సెప్టెంబర్ 17 దగ్గరికి వస్తున్నప్పటికీ జాబ్ క్యాలెండర్ రాలేదన్నారు. ఎప్పుడు అమలు చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు.

News September 3, 2025

FLASH: HYD: గృహిణి ఆత్మహత్య.. కేసు నమోదు

image

HYD అమీన్‌పూర్‌లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే గృహిణి పార్వతి(31) ఉరేసుకుని చనిపోయింది. మృతురాలికి విష్ణువర్ధన్(7), సాత్విక్(6) ఇద్దరు కుమారులు. భర్త వెంకట కోటేశ్వరరావు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

News September 3, 2025

HYD నలు దిక్కుల అభివృద్ధికి రంగం సిద్ధం..!

image

HYD నలు దిక్కుల అభివృద్ధి కోసం 30 వేల ఎకరాల భూమి అవసరమని HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలియజేశారు. 350 కిలోమీటర్ల RRR పనులు త్వరలో ప్రారంభమవుతాయని, మాస్టర్‌ప్లాన్ 2050 సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. HYD విస్తరణలో భాగంగా మొదటి దశలో 1000 ఎకరాలు అవసరమని దీనికి సంబంధించి భూసేకరణపై ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైనట్లు వెల్లడించారు.