News October 9, 2025
HYD: మేడిపల్లిలో భూలోక వైకుంఠం

శ్మశానం. ఆ పేరు వినగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కాలుతున్న శవాల కమరు వాసనతో భీతి గొలిపే వాతావరణం కనిపిస్తుంది. ఎటుచూసినా ముండ్ల పొదలు, సమాధులు, చెత్త, చీకటి, అస్తవ్యస్త మార్గంతో జనం వెనుకడుగేస్తారు. దీనికి భిన్నంగా HYD శివారు మేడిపల్లి శ్మశానానికి హైటెక్ సొబగులు అద్దారు. పచ్చిక బయళ్లు, ప్రకాశవంతమైన కాంతులతో మెరిసిపోతోంది. ఆప్తులను కోల్పోయిన వారి దుఃఖాన్ని దూరం చేస్తోంది. వారికి సాంత్వననిస్తోంది.
Similar News
News October 9, 2025
జనగామ: పొగాకుకు నో చెప్పాలి: డీఎంహెచ్వో

జనగామ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.కె.మల్లిఖార్జున రావు జనగామ GGHలోని NCD క్లినిక్‌ను సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం “పొగాకు రహిత యువతా ప్రచారం” అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. పొగాకు వినియోగం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా పొగాకు పదార్థాలకు నో చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 400 పాఠశాలలు, 30 గ్రామాలను పొగాకు రహితంగా మార్చే లక్ష్యం ఉందన్నారు.
News October 9, 2025
గవాయ్‌పై కులదూషణలు…100 SM హ్యాండిళ్లపై కేసులు

CJI గవాయ్‌పై కులం పేరిట సోషల్ మీడియాలో దూషణలు చేసిన పలువురిపై పంజాబ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా లాయర్ ఒకరు గవాయ్‌పై షూ విసరడం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దూషణలపై 100కు పైగా ఫిర్యాదులు రాగా SM హ్యాండర్లను గుర్తించి కేసులు పెట్టారు. రాజ్యాంగ పదవిని అవమానించడం, హింసను ప్రేరేపించడం, ఎస్సీ, ఎస్టీల పట్ల శత్రుత్వం పెంచడం వంటి అభియోగాలు మోపారు.
News October 9, 2025
జడ్చర్ల: అన్న మరణ వార్త విని తమ్ముడు మృతి

జడ్చర్లలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన వలిపె సురేందర్‌రావు గురువారం మృతిచెందారు. వనపర్తిలో నివసిస్తున్న ఆయన తమ్ముడు వలిపె నరసింహారావు అన్న మరణ వార్త వినగానే కుప్పకూలి మృతిచెందాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బ్రాహ్మణ సంఘం సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.