News October 10, 2025

HYD, మేడ్చల్, రంగారెడ్డిలో 12న పోలియో వ్యాక్సిన్

image

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో ఈ నెల 12న పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా జిల్లా అధికారులు తెలిపారు. 3 జిల్లాల పరిధిలో 12న ఐదేళ్లలోపు పిల్లలకు అందించాలని డాక్టర్లు సూచించారు. ఈ ప్రోగ్రాం కోసం ప్రత్యేక సెంటర్లు సైతం ఏర్పాటు చేస్తామన్నారు. నిండు ప్రాణాలకు- రెండు చుక్కలు వేయించాలని అధికారులు పిలుపునిచ్చారు.

Similar News

News October 10, 2025

HYD: ఇది కదా..! నిజమైన దేశభక్తి

image

మన నగరంలోని వీధులు, రోడ్లు చెత్త కాగితాలతో అపరిశుభ్రంగా కనిపిస్తుంటాయి. ఒకవైపు కేంద్రం స్వచ్ఛభారత్ తెచ్చినా క్షేత్రస్థాయిలో నీరుగారిపోతోంది. ఎవరికి తోచినట్లు వారు కనీస బాధ్యతను మరిచి ప్రవర్తిస్తుంటారు. కానీ ఫిలింనగర్‌లో ఈ విద్యార్థి చదువు నేర్పిన బుద్ధితోనేమో తాను ఉపయోగించిన కవర్లను రోడ్డు పక్కన ఉన్న డస్ట్‌బిన్లలో వేస్తూ కనిపించాడు. ‘ఇది కదా నిజమైన దేశభక్తి అంటే’ అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

News October 10, 2025

HYD: రూ.18 కోట్లు మోసం చేసిన ఘరానా లేడి

image

విద్య అనే ఓ ఘరానా లేడీ తోటి మహిళకు రూ.18 కోట్ల మేర మోసం చేసిన ఘటన పటాన్‌చెరులో వెలుగు చూసింది. సికింద్రాబాద్‌లోని వారణాసిగూడకు చెందిన విద్య.. బంగారం తీసుకుని ఎక్కువ సొమ్ము చెల్లిస్తానని మోసం చేసి పటాన్‌చెరుకు మకాం మార్చినట్లు పోలీసులు తెలిపారు. వెన్నెల అనే మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వినాయక్ రెడ్డి వెల్లడించారు. మాయమాటలు చెప్పి భారీగా వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.

News October 10, 2025

జూబ్లీహిల్స్‌ : ఓపెన్‌ వర్సిటీలో నేడు ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

image

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో స్టైఫండ్‌ బేస్డ్‌ అప్రెంటీస్‌షిప్‌ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులక ఈ-ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ డా.ఎల్వీకే రెడ్డి తెలిపారు. ఈ డ్రైవ్‌లో 8 ప్రముఖ రిటైల్‌ సంస్థలు పాల్గొంటున్నాయన్నారు. ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ ఉ.10 గంటలు నుంచి సీఎస్‌టీడీ భవనంలో ప్రారంభమవుతుందని తెలిపారు.