News May 24, 2024

HYD: మైనర్లకు వాహనాలు ఇస్తే జైలుకే..!

image

మైనర్లు వాహనాలు నడుపుతూ ఇటీవల తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. తద్వారా వారితో పాటు ఇతరుల ప్రాణాలు సైతం పోతున్నాయి. HYD, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు తల్లిదండ్రులకు, మైనర్లకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా మార్పు రావడం లేదు. 18 ఏళ్లు నిండి, లైసెన్స్ పొందిన తర్వాతే బండ్లు నడపాలన్నారు. లేదంటే వాటిని ఇచ్చిన తల్లిదండ్రులు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుని, జైలుకు పంపుతామని హెచ్చరించారు. SHARE IT

Similar News

News November 12, 2025

HYD: ఈ టైమ్‌లో 70% యాక్సిడెంట్స్.. జాగ్రత్త..!

image

HYDలో జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే అత్యధికంగా రాత్రి ఒంటిగంట నుంచి ఉ.10 గంటల మధ్యలో సుమారు 70% ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అతివేగం, మద్యం మత్తులో వాహనంపై పట్టుకోల్పోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. మద్యం తాగి వాహనం నడపొద్దని, ఓవర్ స్పీడ్ వద్దని పోలీసులు సూచిస్తున్నారు.

News November 12, 2025

ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. HYDలో హై అలర్ట్

image

న్యూఢిల్లీ ఎర్రకోటలో బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని వణికించింది. దీంతో మెయిన్ సిటీల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. SCR పరిధిలో భద్రతా తనిఖీలు కఠినం చేశారు. RPF, GRP బాంబు డిఫ్యూజ్ బృందాలు, డాగ్‌ స్క్వాడ్‌లు సికింద్రాబాద్‌, HYD, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లలో తనిఖీలు చేపట్టాయి. సీసీటీవీ నిఘా బలోపేతం చేసి, ప్రయాణీకులు అనుమానాస్పద వస్తువులు గమనిస్తే వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు.

News November 12, 2025

HYD: పెళ్లి చేసుకుందామంటే పిల్ల దొరకట్లే సారూ!

image

HYD, రంగారెడ్డి, మేడ్చల్‌లో ORR వరకు నిర్వహించిన సర్వేలో పెళ్లిపిల్ల కోసం అనేకులు దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ, వధువు దొరకడం లేదని యంగ్ ఏజ్ మ్యారేజ్ సర్వే వెల్లడించింది. కాగా.. 3 ఏళ్లలో దాదాపు 45 శాతం మందికి అమ్మాయిలు దొరకక ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. దీనికి ఉద్యోగం, సంపాదన, సొంతిళ్లు ఇలా పలు కారణాలు ఉన్నాయంది. ఓవైపు పిల్ల దొరకక, మరోవైపు వయసు మీద పడుతుంటే సింగిల్స్‌కు టెన్షన్ పెరుగుతోంది.