News April 5, 2025

HYD: మైనర్లు వాహనాలు నడిపితే.. రిజిస్ట్రేషన్ రద్దు

image

HYD ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి మైనర్ డ్రైవింగ్‌‌పై ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించనున్నారు. ‘మోటారు వెహికిల్ యాక్ట్ ప్రకారం మైనర్ డ్రైవింగ్ నేరం. వాహన రిజిస్ట్రేషన్‌ను 12 నెలల పాటు రద్దు చేస్తారు. మైనర్‌కి 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ అర్హత ఉండదు. తల్లిదండ్రులు, వాహన యజమానులు దీనికి బాధ్యులు అవుతారు’ అని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 5, 2025

రాజేంద్రనగర్‌: మంచి దిగుబడినిచ్చేది ఆముదం ఐసీహెచ్‌-5

image

తక్కువ నీరు ఉన్నా అధిక దిగుబడులు సాధించేలా ఆముదం ఐసీహెచ్‌-5 రకం విత్తనాన్ని అభివృద్ధి చేశామని ఐసీఎఆర్‌-ఐఐఓఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.కె.మాధుర్‌ పేర్కొన్నారు. శుక్రవారం భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో మాట్లాడుతూ.. ఈ సంకర జాతి విత్తనం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగలదన్నారు. ఎకరాకు 5-6 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి ఇస్తుందన్నారు.

News April 5, 2025

HYD: ఈ బాధ్యతలు జోనల్ కమిషనర్లకు అప్పగింత

image

HYDలో కల్తీ ఆహారం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో తనిఖీల్లో ఉల్లంఘనలు గుర్తిస్తే లైసెన్సులు రద్దు చేయడం తదితర అధికారాలు GHMC జోనల్ కమిషనర్లకు అప్పగిస్తూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులకు ఉన్న ఈ విధుల్ని GHMC జోనల్ కమిషనర్లకు అప్పగించారు. GHMC పరిధిలోని 30 సర్కిళ్లకు సంబంధించిన అధికారులను ఐదుగురు జోనల్ కమిషనర్లకు అప్పగించారు.

News April 5, 2025

రైలులో బాలికపై అత్యాచారం.. గాంధీలో వైద్యపరీక్షలు

image

ఈనెల 2న రక్సల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలులో అత్యాచారానికి గురైన బాలికకు(12) గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, ట్రీట్మెంట్‌ను అందించారు. కుటుంబ సభ్యులతో HYD వస్తున్న బాలిక.. అర్ధరాత్రి వారంతా నిద్రలో ఉండగా రైల్లో వాష్ రూమ్‌కి వెళ్లింది. ఆ సమయంలో లోపలికి వెళ్లిన బీహార్‌కు చెందిన వ్యక్తి అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

error: Content is protected !!