News September 7, 2025

HYD: మైనర్‌ బాలికపై అత్యాచారం

image

మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన సిటీ శివారులో వెలుగుచూసింది. పోలీసుల వివరాలు.. శనివారం రాత్రి యాచారం మం. పరిధిలోని ఓ గ్రామంలో బాలికకు మాయమాటలు చెప్పిన ఇద్దరు యువకులు గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లారు. ఓ యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడు. మరొకడు అత్యాచారానికి యత్నించాడు. ఆదివారం బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాలికను చికిత్స నిమిత్తం సిటీలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

Similar News

News September 8, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* రాష్ట్రానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా: దుర్గేశ్
* ప్రభుత్వ అవినీతి వల్లే యూరియా కొరత: బొత్స
* చంద్రబాబుకు కోర్టులంటే లెక్కే లేదు: అంబటి
* వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగు: మహేశ్ గౌడ్
* అవసరమైతే ప్రభుత్వంపై పోరాటానికైనా సిద్ధం: రాజగోపాల్
* కాంగ్రెస్ పాలనలో దీనస్థితికి గురుకులాలు: హరీశ్ రావు
* హాకీ ఆసియా కప్ విజేతగా భారత్
* భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాలు, ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం

News September 8, 2025

మాతా, శిశు వైద్యసేవలు విస్తరిస్తున్నాం: మంత్రి సత్యకుమార్

image

AP: ప్రభుత్వాస్పత్రుల్లో మాతా, శిశు వైద్య సేవలను విస్తరిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. గుంటూరు, కాకినాడ GGHలలో 500 చొప్పున పడకలతో 2 బ్లాకులు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆయా చోట్ల రూ.51కోట్లతో వైద్య పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ కొత్త బ్లాకుల కోసం ICU బెడ్లు, పేషెంట్ మానిట‌ర్లు, వెంటిలేట‌ర్లు, మొబైల్ అల్ట్రా సౌండ్ మెషీన్లు తదితరాలు భారీ స్థాయిలో కొనుగోలు చేయ‌నున్నారు.

News September 8, 2025

కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా: 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా రెడీ
☞ మచిలీపట్నం: పర్యాటకుల జేబులకు చిల్లు.!
☞ మోపిదేవిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
☞ గుడివాడ- కంకిపాడు రోడ్‌లో గుంతలో పడి వ్యక్తి మృతి
☞ మొవ్వలో రూ.1.70 లక్షల విలువైన యూరియా సీజ్
☞పోరంకిలో విజయవాడ ఉత్సవ్ సన్నాహక కార్యక్రమం
☞ జూపూడిలో మందు గుండు సామాగ్రి కలకలం
☞ అవినిగడ్డ మాజీ ఎమ్మెల్యేకి వైసీపీలో కీలక పదవి