News August 25, 2025

HYD మొత్తం వేరు.. జూబ్లీహిల్స్‌లో కథ వేరు

image

నగరం మొత్తం వినాయక చవితి వేడుకల్లో మునిగి ఉండగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాత్రం రాజకీయ కార్యకలాపాల్లో బిజీ బిజీగా ఉంది. ఇక్కడ ఏ పార్టీ నాయకుడు కలిసినా ‘మనకు ఎన్ని ఓట్లు వస్తాయి..’ అనే అడుగుతున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో ఆత్మీయ సమ్మేళనాలు, దావత్‌లు ఘనంగా జరిపేందుకు ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సమ్మేళనాల బాధ్యతలు స్థానిక నాయకులకు అప్పగించి వారి ఓటు బ్యాంకును పటిష్ఠం చేసుకునే పనిలోపడ్డారు.

Similar News

News August 25, 2025

HYD: గణేశ్ మండపాలకు ఫ్రీ కరెంట్

image

గణేశ్ మండప నిర్వాహకులకు విద్యుత్ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్వాహకులు కనెక్షన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గ్రేటర్‌లో గతంలో కమర్షియల్‌ కేటగిరి కింద తాత్కాలిక కనెక్షన్లు జారీ చేసి రూ.1,500 వరకు వసూలు చేసేవారు. ప్రభుత్వం ఈ నెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది.

News August 25, 2025

HYD: 1973లో ‘గణపతి’యాత్ర.. నేడు వరల్డ్ రికార్డు స్థాయికి

image

షిర్డీ యాత్రలో 1973లో కొన్న చిన్న వినాయకుడి విగ్రహంతో ప్రారంభమైన సికింద్రాబాద్ వాసి శేఖర్‌ భక్తి నేడు ప్రపంచ రికార్డు స్థాయికి చేరింది. సాధారణంగా అందరూ స్టాంపులు, నాణేలు సేకరిస్తే, ఆయన మాత్రం 21,708 గణేశుడి విగ్రహాలు, గణపయ్యకు సంబంధించిన 19,558 పోస్ట్‌కార్డులు, ఫొటోలు 14,950, పోస్టర్లు 11,005, కీ చైన్లు 250, ఆడియో, వీడియోలు 250తో కలిపి మొత్తం 58,748 సేకరించారు. ఇది హాబీ కాదు జీవిత మిషన్‌ అన్నారు.

News August 25, 2025

REWIND: నాడు రక్తసిక్త మైన హైదరాబాద్

image

అది 25 AUG 2007 సాయంత్రం.. లుంబినీ పార్కులో ఫ్యామిలీస్, గోఖుల్ ఛాట్ వద్ద ఫుడీస్ ఛాట్ ఎంజాయ్ చేస్తున్నారు. సందడిగా ఉన్న ఆ ప్రదేశాల్లో క్షణకాలంలో ఆర్తనాదాలు, రక్తపు మడుగులో శరీరాలు పడి ఉండటంతో దేశమే ఉలిక్కిపడింది. 18ఏళ్ల క్రితం ఉగ్రవాదుల ఇనుప ముక్కల బాంబులు కుటుంబాలను చీల్చేశాయి. ఆ పరిస్థితులను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ నగరవాసులకు చెమటలు పడతాయి. ఈ ఘటనల్లో 42 మంది మృతిచెందగా.. వందల మంది మంచానపడ్డారు.