News June 4, 2024

HYD: మొదటి రౌండ్ నుంచే ఆధిక్యత కనబరుస్తాం: ఈటల

image

బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ సహా పలు నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ ఏజెంట్లు, స్థానిక నేతలందరినీ ఆయన కలిశారు. కీసర ప్రాంతంలోనూ ఆయన పర్యటించారు. అనంతరం మాట్లాడిన ఈటల మొదటి రౌండ్ నుంచే ఆధిక్యత కనబరుస్తామని నమ్మకం ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. కచ్చితంగా బీజేపీ గెలుస్తుందన్నారు. 

Similar News

News February 18, 2026

రంగారెడ్డి: పోలీసుల అదుపులో 23 మంది విదేశీయులు

image

టోలిచౌకి పరిధిలోని పలు కాలనీల్లో డీసీపీ చంద్రమోహన్ పర్యవేక్షణలో 250 మంది పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న 23 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలతో పాటు 53 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

News February 17, 2026

HYD: జేఈఈ మెయిన్స్‌లో Resonance ప్రభంజనం!

image

JEE మెయిన్‌ 2026 సెషన్‌-1 ఫలితాల్లో హైదరాబాద్‌ Resonance విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. 55 మందికి పైగా విద్యార్థులు 99 పర్సెంటైల్‌కు మించి స్కోరు చేసి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. సమృద్ధి భట్టాచార్య 99.988, రేవంత్ వంగల 99.982, సాకేత్ రెడ్డి 99.932, ఆదిత్య రెడ్డి 99.918, అన్విత రెడ్డి 99.915 అగ్రస్థానంలో నిలిచారు. క్రమశిక్షణతో కూడిన శిక్షణే ఈ విజయానికి కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

News February 16, 2026

BREAKING: కడ్తాల్ వద్ద రెండు కార్లు ఢీ.. ఇద్దరి దుర్మరణం

image

కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్కల్ పహాడ్ గేట్ సమీపంలో ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. NH 765పై రెండు కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లలో ప్రయాణిస్తున్న నరేంద్ర చారి (37), ఎస్‌కే సైదులు (30) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.