News September 9, 2025

HYD: మోత మోగిన కరెంట్ బిల్లు.. హీటర్ కారణమే

image

గ్రేటర్ HYD పరిధి తార్నాక, మల్లాపూర్, ఉప్పల్, చాంద్రాయణగుట్ట సహా అనేక ప్రాంతాల్లో వాటర్ హీటర్లతో మీటర్ల రీడింగ్‌లు గిర్రుమని తిరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కరెంటు బిల్లు రాగా, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం ఉన్నవారికి 200 యూనిట్లు దాటింది. దీంతో కరెంటు బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి. పలువురికి రీడింగ్ ఎక్కువగా రావటానికి కారణాలు పరిశీలిస్తే, అనేక మంది అత్యధికంగా వాటర్ హీటర్లు వాడినట్లు తేలింది.

Similar News

News September 9, 2025

తెలంగాణ భాషకు కాళోజీ కృషి: ADB కలెక్టర్

image

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా పాల్గొని కాళోజీ నారాయణరావు చిత్రాటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ భాష సంరక్షణకు కాళోజీ కృషి చేశారని కొనియాడారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవంతి, జిల్లా అధికారులు ఉన్నారు.

News September 9, 2025

అనకాపల్లి ఎంపీకి డిప్యూటీ స్పీకర్ లేఖ

image

అనకాపల్లి ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సీఎం రమేశ్‌కు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె.రఘు రామకృష్ణంరాజు లేఖ రాశారు. చెన్నై-విజయవాడ వందే భారత్ రైలు సర్వీసును భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల ఆ ప్రాంత ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించారు.

News September 9, 2025

జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్న ఉత్తర తెలంగాణ రైతులు

image

జగిత్యాల పాతబస్టాండ్ వద్ద ప్రభుత్వ కళాశాల మైదానంలో బహిరంగ సభను కొండపల్లి సీతారామయ్య వర్గం వారు 1978 SEP 9న ఏర్పాటు చేశారు. ఈ సభను ఉమ్మడి KNR, ADB, NZB, WGL జిల్లాల రైతు కూలీ సంఘాల వారి ఆధ్వర్యంలోనే నిర్వహించారు. భూమి కోసం, భుక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం, వెట్టి నిర్మూలన కోసం, దున్నేవాడిదే భూమి, వ్యవసాయ కూలీల ధరలు పెంచాలని డిమాండ్లతో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు గ్రామాల్లో ప్రచారంచేశారు.